హైకోర్టు తీర్పు … రేవంత్ కు కేంద్ర బలగాల భద్రత

revanth reddy latest news

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విషయంలో హైకోర్టు  టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి కి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. సీఎం కేసీఆర్ తో ముప్పు ఉందని, రాష్ట్ర ప్రభుత్వ భద్రతపై తనక నమ్మకం లేదని కేంద్ర ప్రభుత్వ భద్రత కల్పించాలని రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్ పిటిషన్ విచారించిన కోర్టు రేవంత్ కు  ఎన్నికలయ్యే వరకు కేంద్ర ప్రభుత్వ భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖకు కోర్టు ఆదేశాలిచ్చింది. రేవంత్ భద్రతకు అయ్యే ఖర్చును రేవంత్ రెడ్డే భరించాలని కోర్టు ఆదేశాలలో పేర్కొంది. రేవంత్ రెడ్డికి 4+4 సిఆర్పీఎఫ్ భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది.

    రేవంత్ రెడ్డి పై గతంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేస్తారు. రేవంత్ రెడ్డిని భూస్థాపితం  చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి అప్పటి నుంచే తన భద్రత పై ఆందోళన వ్యక్తం చేశారు. టిఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి దేహశుద్ది తప్పదని హెచ్చరించారు.ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి తనకు టిఆర్ ఎస్ ప్రభుత్వం నుంచి, నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.

 కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ అంతటా ప్రచారం చేయాల్సి ఉన్నందున తన పై దాడులు జరిగే అవకాశం ఉందని తనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భద్రత పై నమ్మకం లేదని రేవంత్ రెడ్డి అనేక సందర్బాల్లో తెలిపారు. తన భద్రత విషయంలో తనకు, తన కుటుంబసభ్యులకు ఆందోళన ఉందని ఆయన రాష్ట్ర ఎలక్షన్ కమీషన్ అధికారి రజత్ కుమార్ కు వివరించారు.అయినప్పటికీ రజత్ కుమార్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు.

ప్రస్తుతం మహేందర్ రెడ్డి తెలంగాణ డిజిపిగా ఉన్నారు. ఆయన మీద తొలిరోజుల నుంచే రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు. డిజిపి మహేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి లోపాయికారి మద్దతు ఇస్తున్నట్లు రేవంత్ ఆరోపించారు . కనుక రాష్ట్ర భద్రతను నమ్మలేనని చెప్పటం తో ఎన్నికలు పూర్తయ్యే వరకు కేంద్ర హోం శాఖ రేవంత్ రెడ్డి కి  భద్రత కల్పించాలని తీర్పు చెప్పటం టీఆర్ ఎస్ కి చెంప పెట్టు.

revanth reddy latest news,congress leader revanth reddy latest news,high court snesational judgement,central police protection for revanth reddy

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *