Robo 2.0 Review

Robo 2.0 Review
నిర్మాణ సంస్థ‌:   లైకా ప్రొడ‌క్ష‌న్స్
తారాగ‌ణం:  ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్‌, సుధాంశు పాండే, అదిల్ హుస్సేన్‌, రియాజ్ ఖాన్ త‌దిత‌రులు
సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌
ఛాయాగ్ర‌హ‌ణం:  నిరవ్ షా
కూర్పు: ఆంటోని
నిర్మాత‌:  సుభాస్క‌ర‌న్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.శంక‌ర్‌
                                                          సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా అంటే బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డే వేరుగా ఉంటుంది.  అలాంటి సూప‌ర్ స్టార్‌కు శంక‌ర్ లాంటి ద‌ర్శకుడు తోడైతే ఈ అంచ‌నాలు ఎలా ఉంటాయో చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాంటి భారీ అంచ‌నాల‌తో రూపొందిన చిత్రం `2.0`. ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌లు చాలానే ఉన్నాయి. ఇండియ‌న్ మూవీస్‌లో హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీ ఇది. బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టించాడు. అత్య‌ధిక థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతున్న ఇండియన్ మూవీ కూడా ఇదే. భారీ గ్రాఫిక్స్‌, విఎఫ్ఎక్స్‌తో సినిమా తెర‌కెక్కింది. అంతే కాకుండా 2010లో ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన హిట్ చిత్రం `రోబో`కు ఇది సీక్వెల్‌గా రూపొందింది. భారీ అంచ‌నాల‌తో భారీగా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం…
క‌థ‌:
చెన్నైలో సెల్‌ఫోన్స్ అంద‌రి చేతుల నుండి గాల్లోకి ఎగిరిపోతాయి. అస‌లు ఎక్క‌డికి ఎగిరిపోతాయ‌నేది ఎవ‌రికీ అంతు చిక్క‌దు. ఏదో గొప్ప శక్తి ఈ ప‌ని చేస్తుంద‌నుకుంటారు. అదే స‌మ‌యంలో ఓ మొబైల్స్‌ను అమ్మ‌కం చేసే పెద్ద షాప్ ఓన‌ర్‌.. స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌ను ఎవ‌రో హ‌త్య చేస్తారు. సైంటిస్ట్ వ‌శీక‌ర‌ణ్‌, అత‌ని అసిస్టెంట్‌, హ్యుమ‌నాయిడ్ రోబో వెన్నెల(ఎమీజాక్స‌న్‌) చేసిన ఇన్వెస్టిగేష‌న్‌లో సెల్‌ఫోన్స్ ఈ హ‌త్య‌లు చేశాయ‌ని తెలిసి షాక‌వుతారు. ఈ ప‌ని చేస్తున్న శ‌క్తిని అడ్డుకోవాలంటే.. సూప‌ర్ ప‌వ‌ర్ అవ‌స‌రం అని భావించిన వ‌శీక‌ర‌ణ్ చిట్టి స‌హాయం తీసుకోవాల‌నుకున్న హోం మినిష్ట‌ర్ ఒప్పుకోడు. వాళ్లు మిల‌ట‌రీ స‌హాయం తీసుకుంటారు. కానీ ఓ వింత ప‌క్షి ఆకారం వ‌చ్చి మిల‌ట‌రీ బెటాలియ‌న్‌ని నాశ‌నం చేస్తుంది. టెలికాం మినిష్ట‌ర్ కూడా ఓ సెల్‌ఫోన్ కార‌ణంగా చ‌నిపోవ‌డంతో భ‌య‌ప‌డ్డ హోం మినిష్ట‌ర్ చిట్టిని రంగంలోకి దించ‌మ‌ని.. వ‌శీక‌ర‌ణ్‌ని కోరుతాడు. రంగంలోకి దిగిన చిట్టి ఆ పక్షి నుండి ప్ర‌జ‌ల‌ను కాపాడి.. ప‌క్షితో త‌ల‌ప‌డ‌తాడు. అస‌లు ప‌క్షి ఎవ‌రు?  సెల్‌ఫోన్స్‌కు, ప‌క్షికి, ప‌క్షిరాజుకున్న రిలేష‌న్ ఏంటి?  చివ‌ర‌కు చిట్టి స‌క్సెస్ అయ్యాడా లేదా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్ల‌స్ పాయింట్స్‌:
– ర‌జనీకాంత్‌, అక్ష‌య్‌కుమార్ న‌ట‌న‌
– గ్రాఫిక్స్‌
– భారీత‌నం, నిర్మాణ విలువ‌లు
– నేప‌థ్య సంగీతం
– సినిమాటోగ్ర‌ఫీ
మైన‌స్ పాయింట్స్‌:
– క‌థ‌లో ట్విస్ట్‌లు పెద్ద‌గా లేవు
– ఎమోష‌న్స్ పెద్ద ఎఫెక్టివ్‌గా లేవు
– ఎంట‌ర్‌టైన్‌మెంట్ పార్ట్ కూడా త‌క్కువే
విశ్లేష‌ణ‌:
న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఇంత వ‌య‌సులోనూ ఇలాంటి యాక్ష‌న్ సినిమా చేయ‌డానికి అంగీక‌రించ‌డంటే గొప్ప విష‌య‌మే. వ‌శీక‌ర‌ణ్, చిట్టి, వెర్ష‌న్ 2.0గానే కాకుండా.. యూనిట్ సీక్రెట్‌గా ఉంచిన వెర్ష‌న్ 3.0 బుల్లి రోబోగా చ‌క్క‌టి అభిన‌యాన్ని త‌న‌దైన స్టైల్‌తో చేసి మెప్పించాడు. అక్ష‌య్‌కుమార్ పక్షిరాజు అనే ప్రొఫెస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ్డాడు. ప్లాష్ బ్యాక్ ఏపిసోడ్ మిన‌హా అక్ష‌య్‌ను మ‌నిషిగా చూడటం కంటే.. మేక‌ప్‌లో చూడ‌టమే ఎక్కువ‌గా అనిపించింది. లేడీ రోబోట్ పాత్ర‌లో ఎమీ జాక్స‌న్ పాత్ర కీల‌కంగానే ఉంది. సినిమా అంతా ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ పాత్రల మ‌ధ్య‌నే న‌డుస్తుంది. మిగిలిన పాత్ర‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త క‌న‌ప‌డ‌దు. ఇక సాంకేతికంగా చూస్తే.. ద‌ర్శ‌కుడు శంక‌ర్ మెసేజ్‌ను క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లో తెర‌కెక్కించ‌డంలో దిట్ట అని మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నాడు. సినిమాలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ పార్ట్ త‌క్కువ అని తెలిసినా దాన్ని యాక్ష‌న్ పార్ట్‌.. ఎమోష‌న్ పార్ట్‌తో ఫిల్ చేసుకుంటూ వ‌చ్చాడు. ఫ‌స్టాఫ్‌లో సెల‌ఫోన్స్ మాయం కావ‌డం.. హ‌త్య‌లు జ‌రడం..  ప‌క్షిరాజు పాత్ర గురించి తెలియ‌డం.. చిట్టికి, ప‌క్షిరాజు మ‌ధ్య గొడ‌వ‌. ప‌క్షిరాజు శక్తి న్యూట్ర‌లైజ్ చేయ‌డంతో.. ఇక సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే ప‌క్షిరాజు ఎవ‌రు.. అస‌లు సెల్‌ఫోన్స్‌కు, ప‌క్షిరాజుకు ఉన్న క‌నెక్ష‌న్స్ ఏంటి? ప‌క్షిరాజు నెగిటివ్ ఎన‌ర్జీగా ఎలా మారాడ‌నేదే క‌థాంశంగా సాగుతుంది. క‌థ‌లో గొప్ప‌గా ఏదీ లేకున్నా ద‌ర్శ‌కుడు శంక‌ర్ సాంకేతిక‌త‌పై సినిమా ఎక్కువ‌గా న‌డిపించాడు. రెహ‌మాన్ నేప‌థ్య సంగీతం బావుంది. నిర‌వ్‌షా సినిమాటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకుంది. ముత్తురాజు ఆర్ట్ వ‌ర్క్‌, ఆంటోని ఎడిటింగ్ అంతా బావుంది. ఇంత పెద్ద బ‌డ్జెట్‌తో సినిమాను చేయ‌డానికి అంగీక‌రించిన నిర్మాత‌ల‌ను అభినందించాల్సిందే..
చివ‌ర‌గా.. చిట్టి.. రీ లోడెడ్ వెర్ష‌న్ .. మెసేజ్‌తో ఆక‌ట్టుకునే విజువ‌ల్ వండ‌ర్‌.
రేటింగ్‌: 3.25/5

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *