రూపాయి ప‌త‌నం

Rupee Fall Doesnt Boost Export
దేశానికి ఇలాంటి దుర్దినాలు ఎందుకు వ‌స్తున్నాయ‌ని? ఎవ్వ‌రూ మేల్కొల్పు లేకుండా ఎందుక‌ని ప్ర‌వ‌ర్తిస్తారు? అభివృద్ధిలో దూసుకుపోతున్నాం అని చెప్పుకునే స‌ర్కారు ఏంచేస్తుంద‌ని? రూపాయి క్షీణ‌త‌తో ఎగుమ‌తులు పెరుగుతాయా అంటే అబ్బే అలా చెప్ప‌లేం అంటోంది ఇంజినీరింగ్ ఎక్స్‌పోర్ట్ ప్ర‌మోష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.జూలై లో రూపాయి మార‌క‌పు విలువ 6.56శాతం ప‌త‌నం అయినా ఎగుమ‌తుల్లో వృద్ధి 9.4శాతానికి త‌గ్గింది.అంత‌కుమునుపు నెల‌లో 14.17శాతంగా న‌మోదైంది. ఆ నెల‌లో రూపాయి విలువ 5.19శాతం ప‌త‌నం అయ్యింది. రూపాయి విలువ ప‌త‌నం దృష్ట్యా దిగుమ‌తుల భారం ఎలా త‌గ్గిస్తారో కూడా కేంద్రం చెప్ప‌డం లేదు.చ‌మురు, ప‌సిడి దిగుమ‌తుల వ్య‌యాలు పెరిగితే వాణిజ్య లోటు పెరుగు తుంది. ద్ర‌వ్యోల్బణం పెరుగుతుంది.
ఆర్థికంగా వేగం  పుంజుకుంటున్న దేశాన ప‌త‌న కాల సూచీలు గ‌గ్గోలు పెట్టిస్తున్నాయి. అంత‌ర్జాతీయ ప‌రిణామాల దృష్ట్యా మ‌న పాల‌కులు అప్ర‌మ‌త్తంగా లేని కార‌ణంగా రానున్న కాలంలో ధ‌ర‌లు చుక్క‌లు చూపించ‌నున్నాయి. ఇప్ప‌టికే పెట్రో మంట దేశ వ్యాప్తంగా ఉంది. అయిన‌ప్ప‌టికీ ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు చేప‌ట్ట‌ని స్థితిలో స‌ర్కారు ఉంది. మ‌రి బ‌క్క‌చిక్కిన దేహంతో రూపాయి విలవిల‌లాడుతుంటే పాల‌కులు ప్రేక్ష‌క పాత్ర‌కే ప‌రిమితం అవుతున్నార‌న్న‌ది ఓ విమ‌ర్శ‌.
ఏద‌యినా ప‌త‌నం చెంద‌వ‌చ్చు పుంజుకోవ‌చ్చు.. కానీ దేనిక‌యినా ఓ కార‌ణం ఉండిఉండాలి.. తాజాగా రూపాయి ప‌త‌న‌మే భార‌తీయ స‌మాజాన్ని గ‌గ్గోలు పెట్టిస్తోంది.  నియంత్ర‌ణ‌కు మోడీ స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకుంటుందా అంటే లేద‌న్న వాద‌నే విన‌వ‌స్తోంది. డాల‌ర్ తో పోలిస్తే ప‌త‌నం ఆందోళ‌న‌క రంగా ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్ప‌టికి ఇదే క‌నిష్ట స్థాయిని న‌మోదు చేసింది. వ‌ర్థ‌మాన మార్కెట్లు ప‌డిపోతున్నాయి. ప్ర‌స్తుతం రూపాయి మారకం విలువ 71రూపాయ‌ల 21పైస‌లు. మ‌రి ఆ ద‌శ‌లో కేంద్రం స్పందించే తీరుపై దేశ ప్ర‌గ‌తి ఆధార‌ప‌డి ఉంటుంద‌న్న‌ది స‌త్యం.
Engineering Export Promotion Council, Rupee Value Impacts On Export, Money Updates, Indian Rupee Position On Export, Is Rupee Fall Helps Export?, Latest Telugu News, Telugu Updates, TsNews Latest News, Telugu Vaarthalu, EEPC Latest Updates, EEPC On Rupee

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *