ఐఫోన్ తో శామ్ సంగ్ ప్రచారం

Samsung campaign with iPhone

  • వైరల్ గా మారిన వ్యవహారం

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శామ్ సంగ్ ఇబ్బందికర పరిస్థితిలో పడింది. తన కొత్త ఫోన్ ప్రచారాన్ని ప్రత్యర్థి కంపెనీ ఫోన్ ద్వారా చేసి అడ్డంగా దొరికిపోయింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ మొబైల్ దిగ్గజానికి యాపిల్ సంస్థ తో పోటీ ఉంది. యాపిల్ ఐఫోన్లకు ధీటుగా తన ఫోన్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. యాపిల్ సంస్థను తన ప్రత్యర్థి కంపెనీగా భావిస్తుంది. అయితే, తాజాగా శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 9 ఫోన్ ప్రచారం విషయంలో తప్పులో కాలేసి అభాసుపాలైంది. ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలను శామ్ సంగ్ ట్విటర్ లో పోస్టు చేసింది. ఈ ఫోన్ స్క్రీన్ గొప్పదనం గురించి వివరిస్తూ ఓ ట్వీట్ చేసింది. అయితే, దానిని ఐఫోన్ ఉపయోగించి పోస్ట్ చేసింది. అంటే.. తన ఫోన్ గురించి ప్రత్యర్థి కంపెనీ ఫోన్ తో ప్రచారం చేసుకుంది. ఈ విషయాన్ని ప్రఖ్యాత యూట్యూబర్ మర్కెస్ బ్రౌన్ లీ గుర్తించి, సోషల్ మీడయాలో పోస్టు చేశారు. దీంతో అది వైరల్ గా మారింది. వెంటనే యాపిల్ అభిమానులు ట్రోలింగ్ ప్రారంభించారు. శామ్ సంగ్ సిబ్బందికి సొంత కంపెనీ ఫోన్ల కంటే యాపిల్ ఫోన్ల పైనే నమ్మకం ఎక్కువ అంటూ సెటైర్లు మొదలయ్యాయి. జరిగిన తప్పిదాన్ని గుర్తించిన శామ్ సంగ్.. వెంటనే ఆ ట్వీట్ తొలగించినప్పటికీ, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. స్క్రీన్ షాట్లు వైరల్ గా మారి, ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. పాపం శామ్ సంగ్..

Samsung campaign with iPhone , Samsung campaign new mobile , Samsung Moblie Company Latest news, telugu news, Telugu Latest news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *