సండ్ర సంచలన వ్యాఖ్యలు… టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరితే 25 కోట్ల ఆఫర్

sandra venkata veerayya latest news

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2014 ఎన్నికల అనంతరం పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీని వీడినా సండ్ర మాత్రం పార్టీనే నమ్ముకొని ఉన్నారు. ఇప్పటికే సత్తుపల్లిలో వరుసగా రెండుసార్లు విజయం సాధించిన సండ్ర ముచ్చటగా మూడోసారి విజయం సాధించింది హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. దానికితగ్గట్టే ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు.
తాజాగా వేంసూరు మండలం భీమవరం, లచ్చన్నగూడెం, మర్లపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరంలో సండ్ర మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీని వదిలి తమ పార్టీలోకి వస్తే రూ.25కోట్లు ఇస్తామన్నారు. డబ్బు ఆశ చూపి పార్టీ మారాలని ఒత్తిడి తీసుకొచ్చినా, అక్రమ కేసుల్లో ఇరికించినా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పార్టీ వీడకుండా.. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా, ప్రజలే దేవుళ్లుగా భావించి అభివృద్ధి చేస్తున్నానన్నారు.

రాష్ట్రంలో జలగం వెంగళరావు, ఎన్టీ.రామారావు, వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబులను ఆదర్శంగా తీసుకుని ప్రాంతాభివృద్దికి కృషి చేస్తున్నానన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. తనను మరోసారి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని సండ్ర కోరారు.
sandra venkata veerayya latest news,sandra sensational comments on trs government,trs party offerd 25 crores to sandra venkata veerayya

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *