ప్రపంచంలోనే ఎత్తైన ఉక్కుమనిషి విగ్రహం జాతికి అంకితం

Sardar Vallabhbhai Patel

బ్రిటిష్ పాలన అనంతరం ముక్కలు ముక్కలుగా ఉన్న భారతదేశాన్ని తన ఉక్కు సంకల్పంతో ఏకం చేసిన సమైక్యతా సారథి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింది. ఉక్కు మనిషి పటేల్ జ్ఞాపకార్థం గుజరాత్ లోని కేవడియాలో నర్మదా నదీ తీరంలో నిర్మించిన ఆయన నిలువెత్తు విగ్రహాన్ని.. ఆయన 143వ జయంతిని పురస్కరించుకొని మోదీ బుధవారం ఆవిష్కరించారు. విగ్రహం ఎత్తు 182 మీటర్లు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహంగా అది రికార్డు సృష్టించింది.విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. దేశ సమగ్రతకు కృషి చేసిన పటేల్ విగ్రహావిష్కరణ తన చేతుల మీదుగా జరగడం తన అదృష్టమని అన్నారు. దేశ సమగ్రతే ఆశ – శ్వాసగా భావించిన మహనీయుడు పటేల్ అని గుర్తుచేశారు. కౌటిల్యుడి వ్యూహం – శివాజీ శౌర్య ప్రతాపం మిళితమైన వ్యక్తిగా పటేల్ను అభివర్ణించారు. భారత్ ప్రస్తుతం ఐక్యంగా ఉందంటే అది సర్దార్ చొరవేనంటూ కీర్తించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పటేల్ విగ్రహం ఏర్పాటుపై ఆలోచిస్తున్నానని.. ప్రధాని అయ్యాక తన కల నెరవేరిందని పేర్కొన్నారు. ఐక్యతా విగ్రహాన్ని జాతికి అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా – గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తదితరులు పాల్గొన్నారు.
సర్దార్ విగ్రహ విశేషాలను చూస్తే గుజరాత్ లోని సర్దార్ సరోవర్ డ్యామ్ కు 3.5 కిలోమీటర్ల దూరంలో గల సాధు బెట్ ఐలాండ్ నిర్మించిన ఈ విగ్రహం నిర్మాణ వ్యయం రూ.2989 కోట్లు ఇక ఎత్తు 182 మీటర్లు
ప్రాజెక్టు మొత్తం పరిధి 19700 చదరపు మీటర్లు, విగ్రహ నిర్మాణంలో 1700 టన్నుల కాంస్యం – 180000 క్యూబిక్ మీటర్ల సిమెంటు,18500 టన్నుల స్టీల్ కాంక్రీట్ లో కలిపి వినియోగించారు. 6500 టన్నుల స్టీల్ విడిగా కూడా వినియోగించారు. 3 వేల మంది కార్మికులు – 300 మంది ఇంజినీర్లు ఈ నిర్మాణం కోసం పని చేశారు.విగ్రహం ఛాతీ భాగం వరకూ రెండు లిఫ్ట్ ల్లో సందర్శకులు వెళ్లవచ్చు. ఆ ప్రాంతంలో ఒకేసారి 200 మంది నిల్చొని పరిసరాలను వీక్షించవచ్చు. దేశానికి కీర్తి తెచ్చిన ఉక్కుమనిషి విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని తాను కన్న కల నెరవేరిందని చెప్పారు.

Sardar Vallabhbhai Patel , The statue of the world’s tallest steelman is   Sardar Vallabhbhai Patel , World’s tallest statue is   Sardar Vallabhbhai Patel,  143rd birth anniversary day, Telugu News, Telugu Update News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *