స‌మ‌స్య‌ల సుడిగుండంలో స‌ర్కార్

Sarkar Movie News

అమ్మ ఆత్మ క్షోభిస్తుంద‌ని.. అమ్మ లాంటి అమ్మ ఇక రాద‌ని మీరంతా అన‌గా త‌మిళ తంబీలంతా అనుకుంటున్నార‌ని ఓ ఊహ‌.అంతా కాకున్నా కొంద‌ర‌యినా ఇలానే అనుకోవాలి. లేదా అనుకున్న‌ట్లు న‌టించాలి. లేక‌పోతే చాలా ఇబ్బంది. భ‌విష్య‌త్ అన్న‌దే ఉండ‌దు క‌ద‌య్యా. ఈ సారి జ‌య‌మ్మ పై సెటైర్ ని కాయిన్ చేశాడు డైరెక్ట‌ర్ మురుగ దాస్.. ఇదీ ఏమాత్రం రుచించ‌ని త‌మిళ నాట నాయ‌కులు థియేట‌ర్ల ఎదుట నానా హడావుడీ చేస్తున్నారు. స‌ర్కార్ సినిమాలో అభ్యంత‌రక‌ర దృశ్యాలున్నాయ‌ని వాటిని వెంట‌నే తొల‌గించాల‌ని థియేట‌ర్ల ఎదుట హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. త్వ‌ర‌లో హైకోర్టుకు వెళ్లేందుకు సైతం అక్క‌డి ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మవుతోంది. ఇది ద‌ర్శ‌క నిర్మాత‌ల పిరికిపంద చ‌ర్య అని ద‌మ్ముంటే అమ్మ ఉన్న‌ప్పుడే ఇలాంటి స‌న్నివేశాల‌తో సినిమా రూపొందించి విడుద‌ల చేస్తే వారి ధైర్య గుణాల‌ను మెచ్చుకునేవార‌మ‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా విజ‌య్ న‌టించిన మెర్స‌ల్ , తుపాకి , క‌త్తి ఇలా అనేకానేక చిత్రాలు వివాదాల్లోనే చిక్కుకుపోయాయి,.

Sarkar Movie News , Sarkar Movie latest Movie, Director Murugadas Sarkar Movie , The government is also ready to go to the High Court soon

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *