`స‌ర్కార్` స‌మ‌స్య సాల్వ్‌

Sarkar Movie
విజ‌య్‌, మురగ‌దాస్ క‌ల‌యిక‌లో తుపాకి, క‌త్తి చిత్రాల త‌ర్వాత రూపుదిద్దుకున్న చిత్రం `స‌ర్కార్‌`. కీర్తిసురేశ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్స్‌. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 6న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. అయితే స‌ర్కార్ క‌థ త‌నదంటూ వ‌రుణ్ రాజేంద్ర‌న్ అనే వ్య‌క్తి ర‌చ‌యిత‌ల సంఘంలో ఆరోపించి.. చెన్నై హైకోర్టులో కేసు పైల్ చేశాడు. ర‌చ‌యితల సంఘం స‌హ‌కారం కూడా వ‌రుణ్ రాజేంద్ర‌న్‌కే ద‌క్కింది. దీంతో సినిమా విడుద‌ల‌పై అనుమానాలు నెల‌కొన్నాయి. తీర్పు కంటే ముందే ద‌ర్శ‌కుడు, నిర్మాణ సంస్థ ప్ర‌తినిధులు వ‌రుణ్‌ను క‌లిసి టైటిల్ కార్డ్స్‌లో పేరు వేస్తామని అన‌డంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది. దీంతో క‌థ వ‌రుణ్‌దేన‌ని ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ ఒప్పుకున్న‌ట్లు అయ్యింది. కోర్టు కూడా సినిమాను న‌వంబ‌ర్ 6న విడుద‌ల చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

Sarkar Movie , Murugadoss and Varun Rajendran settle issue out of court

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *