SARKAR REVIEW FOR TS

SARKAR REVIEW
ఎ.ఆర్.ముర‌గ‌దాస్ పేరు విన‌గానే ఠాగూర్‌, తుపాకి, క‌త్తి చిత్రాల‌తో పాటు స్పైడ‌ర్ సినిమా గుర్తుకు వ‌స్తుంది. మ‌హేశ్‌తో ఈ ద‌ర్శ‌కుడు చేసిన స్సైడ‌ర్ డిజాస్ట‌ర్ అయ్యింది. ఓ ర‌కంగా తెలుగు చిత్ర సీమ ముర‌గ‌దాస్‌కు ఎందుక‌నో పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. అయితే  త‌మిళంలో ఈయ‌న‌కు మంచి క్రేజే ఉంది. అందుకే త‌మిళంలో నెంబ‌ర్ వ‌న్ హీరోల్లో ఒక‌రైన విజ‌య్ ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్‌తో మూడోసారి ప‌నిచేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. తుపాకి, క‌త్తి చిత్రాల త‌ర్వాత విజ‌య్‌, ముర‌గ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్ర‌మే `స‌ర్కార్‌`. ఐదేళ్ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓటు విలువ తెలియ‌క డ‌బ్బుల‌కు త‌మ ఓటును ఇచ్చేసే చాలా మందికి దాని విలువ‌ను తెలియ‌జేప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు ముర‌గ‌దాస్‌. అస‌లు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో ముర‌గ‌దాస్ పొలిటిక్ థ్రిల్ల‌ర్‌ను ఎందుకు చేయాల్సి వ‌చ్చింది? త‌మిళ‌నాట‌  విజ‌య్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం అని వార్త‌లు వినిపిస్తున్న త‌రుణంలో స‌ర్కార్ విజ‌య్‌కు క్రేజ్‌ను ఇంకా పెంచిందా?  స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెట్టిందా?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా క‌థంటో చూద్దాం…
విడుద‌ల‌: అశోక్ వ‌ల్ల‌భ‌నేని
నిర్మాణ సంస్థ‌: స‌న్ పిక్చ‌ర్స్‌
నిర్మాత‌: క‌ళానిధి మార‌న్‌
ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్‌
తారాగ‌ణం:  విజ‌య్‌, కీర్తిసురేశ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, రాధార‌వి, యోగిబాబు, త‌దిత‌రులు
మాట‌లు: శ‌్రీరామ‌కృష్ణ‌
పాటలు: చ‌ంద్ర‌బోస్‌, వ‌న‌మాలి
సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
ఛాయాగ్ర‌హ‌ణం:  గిరీశ్ గంగాధ‌ర‌న్‌
కూర్పు: శ‌్రీక‌ర్ ప్ర‌సాద్‌
క‌థ‌:
ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ కార్పొరేట్ కంపెనీ జి.ఎల్ గ్రూప్‌కి సి.ఇ.ఒ సుంద‌ర్ రామ‌స్వామి(విజ‌య్‌). ఎన్‌.ఆర్‌.ఐ హోదాలో ఇండియాకు వ‌చ్చి ప్ర‌తి ఐదేళ్ల‌కు ఓసారి త‌న ఓటు హ‌క్కును వినియోగించుకుంటూ ఉంటాడు. అదే క్ర‌మంలో ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌డానికి వ‌చ్చిన త‌న‌కి త‌న ఓటును ఎవ‌రో దొంగ ఓటు వేసేసార‌ని తెలుసుకుని డిసప్పాయింట్ అవుతాడు. ఓటు వేయ‌డం త‌న హ‌క్కు అని భావించి.. కోర్టుకు వెళ్లి 49 పి సెక్ష‌న్ క్రింద బ్యాలెట్ ఓటు హ‌క్కును పొందుతాడు. దాంతో 49పి సెక్ష‌న్ గురించి చాలా మందికి తెలుస్తుంది. ఓ ప్రైవేట్ పార్టీలో కాబోయే అధికార పార్టీ నాయ‌కుడు (రాధా ర‌వి) సుంద‌ర్‌ని రెచ్చ‌గొట్టేలా మాట్లాడుతాడు. దాంతో సుంద‌ర్ దొంగ ఓటుతో త‌మ ఓటు హ‌క్కును కోల్పోయిన వారిని రెచ్చ‌గొడ‌తాడు. దాంతో అంద‌రూ కోర్టులో కేసు వేస్తారు. చివ‌ర‌కు  కోర్టు ఎల‌క్ష‌న్స్‌ను ర‌ద్దు చేసి ప‌దిహేను రోజుల్లో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని తీర్పు ఇస్తుంది. దాంతో ముఖ్య‌మంత్రి కావాల‌నుకున్న అభ్య‌ర్థి(పాల క‌రుప్ప‌య్య‌), అత‌ని కుమార్తె కోమ‌ల‌వ‌ల్లి(వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌) సుంద‌ర్‌ని చంప‌డానికి, అత‌ని పేరు ప్ర‌తిష్ట‌ల‌ను నాశ‌నం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. దాంతో సుంద‌ర్ పూర్తిస్థాయి ఎన్నిక‌ల్లో దిగి త‌న అభ్య‌ర్థుల‌ను పోటీలో పెడ‌తాడు. రాజ‌కీయ నాయ‌కుల ఆలోచ‌న‌ల‌కు సుంద‌ర్ ఎలా అడ్డుక‌ట్ట వేస్తాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
ప్ల‌స్ పాయింట్స్‌:
– విజ‌య్ న‌ట‌న‌
– సినిమాటోగ్ర‌ఫీ
– ఎంచుకున్న పాయింట్ మంచిదే
మైన‌స్ పాయింట్స్‌:
– ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం
– స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా లేవు
– ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ కారు
– కామెడీ లేదు
– సంగీతం, నేప‌థ్య సంగీతం
స‌మీక్ష‌:
న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. విజ‌య్ సి.ఇ.ఒ పాత్ర‌లో ఒదిగిపోయాడు. స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకోవ‌డ‌మే కాదు.. త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించాడు. డాన్సులు, యాక్ష‌న్స్‌లో త‌న‌దైన రీతిలో మెప్పించాడు. కీర్తిసురేశ్ పాత్ర‌కు ప్రాధాన్య‌తే లేదు. మ‌హాన‌టి వంటి సినిమా చేసిన త‌ర్వాత పెర్ఫార్మెన్స్ లేని పాత్ర‌లు చేయ‌డం వ‌ల్ల త‌న ఉనికికే ప్ర‌మాదం కావ‌చ్చు. ఇలాంటి పాత్ర‌ను త‌ను ఎందుకు ఒప్పుకుందో తెలియ‌దు. ఇక వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ రాజ‌కీయ నాయ‌కురాలి పాత్ర‌లో క‌న‌పడింది. సినిమా ముగియడానికి న‌ల‌భై నిమిషాల ముందు మాత్ర‌మే ఈ పాత్ర తెర‌పై ఎంట్రీ ఉంటుంది. అయితే ఉన్నంత‌లో త‌న పాత్ర‌కు వ‌ర‌ల‌క్ష్మి న్యాయం చేసింది. రాధార‌వి పాత్ర కాస్త కామెడీ ట‌చ్‌తో సాగింది. పాల క‌రుప‌య్య‌, యోగిబాబు ఇత‌ర పాత్ర‌ధారులు వారి వారి పాత్ర‌ల మేర న్యాయం చేశారు. ఇక సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. ద‌ర్శ‌కుడు ముర‌గ‌దాస్ ఇలాంటి క‌థ‌ను ఎలా తీశాడా? అనిపించింది. సాధార‌ణంగా క‌థ‌ను దొంగ‌లించేసినా.. తెర‌పై ఆ క‌థ‌ను హ్యాండిల్ చేయ‌డంలో ముర‌గ‌దాస్ బాగానే ప్ర‌య‌త్నిస్తాడు. కానీ ఈ సినిమా విష‌యంలో ముర‌గ‌దాస్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. సెక్ష‌న్ 49పి అనే పాయింట్ మంచిదే.దానిపై క‌థ స్టార్ట్ అవుతుంది. సూటిగా సుత్తి లేకుండా క‌థ‌ను స్టార్ట్ చేసినా.. దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు బోరింగ్‌గా ఉంటాయి. మ‌ధ్య‌లో ఓ కుటుంబం కిరోసిన్ పోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకోవ‌డం.. ఆ కుటంబానికి హీరో అండ‌గా నిల‌వాల‌నుకోవ‌డం.. అదెలా ఉండే మ‌రెన్నో కుటుంబాల‌కు ఆద‌ర‌ణ అందించ‌డం.. వారి స‌మ‌స్య‌ల‌కు ప్ర‌భుత్వ‌మే కార‌ణంగా చూపించ‌డం మ‌రో ప‌క్క ఎన్నిక‌లు ఇలా క‌థ‌ను ప‌క్కాగా నడ‌ప‌డంలో ముర‌గ‌దాస్ ఫెయిల్ అయ్యాడు. రెహ‌మాన్ ట్యూన్స్ అస్స‌లు బాలేవు. నేప‌థ్య సంగీతం అంతంత మాత్రమే. గంగాద‌ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది.  సినిమా ఫ‌స్టాఫ్ కాస్త ప‌ర్వాలేద‌నిపిస్తుంది కానీ.. సెకండాఫ్ మ‌రీ బోర్ కొట్టిస్తుంది.
బోట‌మ్ లైన్‌:  విజ‌య్ అభిమానుల‌కు మాత్ర‌మే
రేటింగ్‌: 2/5
SARKAR LATEST MOVIE, SARKAR MOVIE NEWS, SARKAR UPDATE NEWS, TELUGU NEWS,

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *