సీఎం నేనే అంటూ సర్వే సత్యన్నారాయణ సంచలన వ్యాఖ్యలు

Satyanarayana is a sensational comments

తెలంగాణా ఎన్నికలకు ఇంకా కొన్ని గంటలే వుంది. ఇక చివరి రోజు ప్రచారం కీలకంగా మారింది. ఇప్పటికే ఇన్ని రోజులుగా ప్రచారం చేసిన నేతలు తాజాగా సంచలన ప్రకటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తే అలాగే అనిపిస్తున్నాయి.
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అసలు రేపు ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో తెలీదు. ఎవరు అధికారం దక్కించుకుంటారో తెలీదు . ఇక ఎక్కడికక్కడ పోటీ చూస్తే చాలా తీవ్రంగా వుంది. ఈ నేపధ్యంలో అసలు పని చూడండిరా నాయనా అంటే సీఎం ఎవరో ఎవరికి వారు సంచలన వ్యాఖ్యలు చేసుకుంటూ పోతున్నారు.
తెలంగాణ ముందస్తు ఎన్నికలు ఇంకా ప్రచార దశలోనే ఉన్నాయి. కానీ అప్పుడే ప్రజాకూటమిలో సీఎం సీటుపై లొల్లి మెుదలైంది. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే 40 మంది సీఎంలు అంటూ టీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలను నిజం చేసేలా కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అనవసరపు తలనొప్పి తెచ్చుకుంటున్నారు.
ఇంకా ఎన్నికల ప్రచారం ముగియలేదు. ఎన్నికలు జరగలేదు, ఫలితాలు విడుదల కాలేదు. బాక్స్ లో ఓటు పడలేదు కానీ సీఎం కుర్చీపై మాత్రం రగడ మెుదలవుతుంది. తాజాగా ప్రజాకూటమి అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని కాంగ్రెస్ సీనియర్ నేత, కంటోన్మెంట్ ప్రజాకూటమి అభ్యర్థి సర్వే సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. దళిత కోటాలో తనకు ఆ అవకాశం వస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే సీఎం రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జానా రెడ్డి , భట్టి విక్రమార్క వంటి నాయకులు పోటీ పడుతూనే ఇక తాజాగా నేనేం తక్కువ తిన్నానా నేనే సీఎం అభ్యర్థి అని సర్వే సత్యన్నారాయణ కూడా తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు.
కంటోన్మెంట్‌ నియోజకవర్గ పరిధిలోని కార్ఖానా, కాకగూడలో రోడ్ షో నిర్వహించిన ఆయన సీఎం కుర్చీపై కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వే సత్యనారాయణకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్న కాంగ్రెస్‌ మహిళా నాయకురాలు, సినీనటి నగ్మా అలా చూస్తుండిపోయారు. సీఎం సీటు గురించి మాట్లాడే ముందు కాస్తైనా ఆలోచించకుండా అలా వ్యాఖ్యలు చేస్తున్న సర్వే సత్యన్నారాయణ ను ఏమనాలో కూడా అర్ధం కాని స్థితిలో ఆమె అవాక్కయ్యారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చి మాట తప్పారని గుర్తుచేశారు. ఒకవేళ కాంగ్రెస్‌ అధిష్ఠానం దళితుడిని సీఎం చేస్తానని నిర్ణయిస్తే దళితుడైన తనకు ఆ అవకాశం రావొచ్చని అభిప్రాయపడ్డారు సర్వే సత్యన్నారాయణ .
ఇక ఆయన వ్యాఖ్యలకు అక్కడ ఉన్న అంతా ఆశ్చర్యంగా చూడటంతో కనీసం డిప్యూటీ సీఎం పదవి అయినా వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. పోనీ అదీ లేకుంటే మంత్రినైనా అవుతానని ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఓటర్లకు హామీ ఇచ్చారు సర్వే సత్యనారాయణ. మొత్తానికి సర్వే సత్యన్నారాయణ తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ లో చర్చకు దారి తీస్తుంటే అవి గులాబీ దళానికి అస్త్రాలుగా మారాయి. కాంగ్రెస్ గెలిస్తే రోజుకో సీఎం ఉంటారు అని ఇప్పటికే ప్రచారం చేస్తున్న టీఆర్ ఎస్ ఇప్పుడు సర్వే వ్యాఖ్యలను సైతం వాడుకోనుంది .

Satyanarayana is a sensational comments , Satyanarayana Latest news, Congress Latest news, TRS Update news, Telangana Election update news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *