సేవ్ డెమొక్ర‌సీ

save democracy says ap cm

దేశం ప్ర‌జ‌ల చేతిలో లేద‌ని పాల‌కుల చేతిలో లేద‌ని కేవ‌లం కార్పొరేట్ల చేతిలో ఉంద‌ని ఎంత‌గా చెప్పినా వినిపించుకోరు కొంద‌రు.ఇప్పుడు సేవ్ డెమొక్ర‌సీ సేవ్ కంట్రీ అంటూకొత్త ప‌దాలేవో అందుకుంటున్నారు.అస‌లీ పదాలు వాటి అర్థాల సంగ‌తి అటుంచితే చంద్ర‌బాబు – రాహుల్ భేటీ నే ఇవాళ అతి పెద్ద చ‌ర్చ‌కు తావిచ్చే అంశం. తాజాగా సేవ్ డెమొక్ర‌సీ అనే పేరిట పిలుపునిచ్చిన న‌వ్యాంధ్ర సీఎం మోడీ వ్య‌తిరేక కూటమి ఏర్పాటుపై స‌న్నాహాలు చేస్తున్నారు. నారా వారి ఫ్రంట్ ఒక‌టి రూపుదిద్దుకుంటుంది… అతి త్వ‌ర‌లో అని చాలా మంది నాయ‌కులు క‌ల‌లు కంటున్నారు. అది జ‌రిగినా జ‌ర‌గ‌కున్నా ద‌శాబ్దాల వైరం ప‌క్క‌న‌పెట్టి మ‌రీ చంద్ర‌బాబు రాహుల్ ద్వ‌యం ముందుకు వెళ్ల‌డమే అత్యంత ఆశ్చ‌ర్య‌క‌రం.దేశాన్ని కాపాడుకోవ‌డ‌మే ధ్యేయంగా తాము ప‌నిచేస్తామ‌ని బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌ను ఏక‌తాటిపై తెస్తామ‌ని చెబుతున్నారు రాహుల్‌. ఇవాళ అది సాధ్య‌మేనా.. దేశం మాట దేవుడెరుగు క‌నీసం ద‌క్షిణాదిలో అయినా బాబు ఏకాభిప్రాయం తీసుకురాగ‌ల‌రా? ఇప్పుడు ప్ర‌జాస్వామ్యం ఓడిపోయింద‌ని తామేదో ర‌క్షిస్తామంటున్న పెద్ద‌లు నిన్న‌టి దాకా అదే పార్టీల‌తో ప‌ద‌వులు పంచుకున్న వారే అన్న సంగ‌తి ఆంధ్రుల‌కు తెలియంది కాదు క‌నుక కాంగ్రెస్ పొత్తుతో దేశం లాభం ప‌డ‌డం మాట అటుంచి న‌ష్ట‌పోవ‌డం గ్యారెంటీ.

save democracy says ap cm chandrababu naidu,cm chandrababu naidu latest news,cm chandrababu naidu friend ship with congress party,ap cm naidu latest news,

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *