SAVYASACHI MOVIE REVIEW

SAVYASACHI MOVIE REVIEW

మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ప్రేమ‌మ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌వ‌ద్ద‌ని అంటే చైత‌న్య‌, చందు మొండేటి ఓ న‌మ్మ‌కంతో రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. అదే న‌మ్మ‌కంతో చైత‌న్య ఇప్ప‌టి వర‌కు త‌న‌కు అచ్చిరాని యాక్ష‌న్ జోన‌ర్ సినిమా చేయాల‌నుకున్నాడు. అందులో భాగంగా చేసిన యాక్ష‌న్ ప్ర‌ధాన చిత్ర‌మే `స‌వ్య‌సాచి`. కేవ‌లం యాక్ష‌న్ కాకుండా.. వానిషింగ్ సిండ్రోమ్ అనే పాయింట్‌ను క‌థ‌లో బ్లెండ్ చేశాడు. కార్తికేయ‌, ప్రేమ‌మ్ స‌క్సెస్‌లు త‌ర్వాత చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం కావడంతో పాటు సినిమాపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. స‌వ్య‌సాచి అయినా త‌న‌కు యాక్ష‌న్ హీరో పేరుని తెచ్చి పెడుతుంద‌ని భావించిన చైత‌న్య ఆశ‌లు ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాయ‌నేది తెలుసుకోవాలంటే సినిమా క‌థలోకి వెళ‌దాం…

బ్యాన‌ర్‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌
న‌టీన‌టులు: నాగ‌చైత‌న్య‌, మాధ‌వ‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, భూమిక‌, భ‌ర‌త్ రెడ్డి, బ్ర‌హ్మాజీ, స‌త్య‌, వెన్నెల‌కిశోర్‌, ష‌క‌ల‌క శంక‌ర్ త‌దిత‌రులు
ఎడిటింగ్: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
ఆర్ట్‌: రామ‌కృష్ణ‌
మ్యూజిక్ : ఎం.ఎం.కీరవాణి
కెమెరా: యువ‌రాజ్‌
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్‌
క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: చ‌ందు మొండేటి
వ్య‌వ‌థి: 150 నిమిషాలు
సెన్సార్‌: యు/ఎ
క‌థ‌:
త‌ల్లిదండ్రులు ( ఆనంద్‌, క‌ల్యాణి) చేసిన పోష‌కాహార లోపం కార‌ణంగా.. వానిషింగ్ సిండ్రోమ్ విక్ర‌మ్ (అక్కినేని నాగ‌చైత‌న్య‌)ని ఇబ్బంది పెడుతుంటుంది. త‌ల్లి గ‌ర్భంలోనే ఓ శిశువు చ‌నిపోతుంది. ఆ శిశువ తాలుకా ల‌క్ష‌ణాలు మెద‌డులో నిక్షిప్త‌మ‌వుతాయి. విక్ర‌మ్‌కి ఎక్కువ ఆనందం, దుఃఖం వ‌చ్చిన‌ప్పుడు అత‌ని ఎడ‌మ చేయి అసంక‌ల్పితంగా స్పందిస్తుంటుంది. ఈ విష‌యం ముందు తెలిసినా విక్ర‌మ్ త‌ల్లి అత‌ని ఎడ‌మ చేయిని త‌న పెద్ద కొడుకు ఆదిత్య అని భావిస్తుంది. త‌ల్లి చనిపోయిన త‌ర్వాత అక్క (భూమిక‌) సంర‌క్ష‌ణ‌లోనే విక్ర‌మ్ పెరిగి పెద్ద‌వాడ‌వుతాడు. కాలేజ్‌లో ఛైత్ర ( నిధి అగ‌ర్వాల్‌)ని ప్రేమిస్తాడు. కానీ కుటుంబ ప‌రిస్థితుల కార‌ణంగా ఆరేళ్ల పాటు చిత్ర‌కు దూర‌మ‌వుతాడు. ఆరేళ్ల త‌ర్వాత యాడ్ డైరెక్ట‌ర్ అయిన త‌ర్వాత అనుకోకుండా చిత్ర‌ను క‌లుస్తాడు. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుడుతుంది. అంతా బావుంటుంద‌నుకుంటున్న త‌రుణంలో విక్ర‌మ్ అక్క‌య్య ఇల్లు ప్ర‌మాద‌వ‌శాతు కూలిపోతుంది. విక్ర‌మ్ బావ, పాప మ‌హాల‌క్ష్మి చ‌నిపోతారు. అస‌లు ఇదంతా ఎవ‌రు చేస్తున్నార‌ని విక్ర‌మ్ ఆలోచిస్తున్న త‌రుణంలో త‌న అక్క కూతురు చ‌నిపోలేద‌ని తెలుస్తుంది. అస‌లు విక్ర‌మ్ కుటుంబం క‌ష్టాలు ఎదుర్కొడానికి కార‌ణం ఎవ‌రు? చివ‌ర‌కు విక్ర‌మ్ త‌న స‌మ‌స్య‌ల‌ను ఎలా ఎదుర్కొన్నాడ‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

విశ్లేష‌ణ‌:
న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. హీరో నాగ‌చైత‌న్య మంచి న‌ట‌న‌ను క‌న‌ప‌రిచాడు. స్టైలిష్ లుక్‌తో క‌న‌ప‌డుతూనే వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ కార‌ణంగా ఇబ్బంది ప‌డే యువ‌కుడి పాత్ర‌లో చైత‌న్య న‌ట‌న మెప్పిస్తుంది. డాన్సులు కూడా బావున్నాయి. చైతు అక్క‌య్య పాత్ర‌లో భూమిక‌, బావ పాత్ర‌లో భ‌ర‌త్ రెడ్డి చ‌క్క‌గా న‌టించారు. ఇక హీరో స్నేహితులుగా వెన్నెల‌కిషోర్‌, న‌వీన్‌, స‌త్య అంద‌రూ వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించారు. ఇక మెయిన్ విల‌న్ పాత్ర‌లో న‌టించిన మాధ‌వ‌న్ న‌ట‌న గురించి ప్ర‌స్తావ‌న అక్క‌ర్లేదు. సూప‌ర్బ్ న‌ట‌న‌ను క‌న‌పరిచాడు. మిగిలిన పాత్ర‌ధారులంద‌రూ వారి వారి పాత్ర‌ల మేర చ‌క్క‌గా న‌టించారు. ఇక టెక్నీషియ‌న్స్ విష‌యానికి వ‌స్తే.. ద‌ర్శ‌కుడు చందు మొండేటి రాసుకున్న మెయిన్ పాయింట్ చ‌క్క‌గా ఉంది. అయితే ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు గొప్ప‌గా లేవు. ఫ‌స్టాఫ్ విష‌యానికి వ‌స్తే క్యారెక్ట‌ర్స్ ఎష్టాబ్లిష్ చేసిన త‌ర్వాత వ‌చ్చే కాలేజీ సన్నివేశాలు కామెడీని జ‌న‌రేట్ చేస్తాయ‌నుకున్నారేమో కానీ.. గొప్ప‌గా అయితే లేదు. స‌న్నివేశాలు గ్రిప్పింగ్‌గా లేవు. సెకండాఫ్‌ విష‌యానికి వ‌స్తే.. హీరో, విల‌న్ మ‌ధ్య మైండ్ గేమ్ మొద‌ల‌వుతుంది. మ‌ధ్య‌లో మ‌ళ్లీ కాలేజీ సీన్స్‌ను యాడ్ చేయ‌డంతో ఫ్లో ప‌క్క‌కు వెళ్లింది. సుభద్ర ప‌రిణ‌యం సీన్ కామెడీగా బావుంది. సినిమాను న‌డిపించిన తీరు ఎగుడుదిగుడులుగా అనిపించింది. కీర‌వాణి సంగీతంలో టైటిల్ సాంగ్ మాత్ర‌మే బావుంది.. అలాగే నేప‌థ్య సంగీతం కూడా బావుంది. ఇక నిన్ను రోడ్డు మీద చూసినాదే లగాయిత్తు .. సాంగ్ రీమిక్స్ గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. యువ‌రాజ్ కెమెరా వ‌ర్క్ బావుంది. ఎడిట‌ర్ ఫ‌స్టాఫ్‌కు కోత పెట్టేస్తుండొచ్చు. ఆర్ట్ వ‌ర్క్ బావుంది. మంచి పాయింటే అయినా.. ఆక‌ట్టుకోని స‌న్నివేశాల‌తో చేసిన ప్ర‌యత్నం.
బోట‌మ్ లైన్‌:
స‌వ్య‌సాచి.. అక్కినేని అభిమానుల‌కు మాత్ర‌మే
రేటింగ్‌: 2/5

CHAITHU LATEST MOVIE

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *