శేరిలింగంపల్లిలో చెప్పులతో కొట్టుకున్న తెలుగు తమ్ముళ్ళు

Sharilingampalli news

కూటమి పార్టీల్లోని అసమ్మతి కూటమి కొంప ముంచేలా ఉంది. తాజాగా గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఆ స్థానం తమకు కేటాయించటంతో ప్రచారం ప్రారంభించారు. అయితే ఆశావహులు మువ్వా సత్యన్నారాయణ, భవ్య చిట్స్ ఆనంద్ ప్రసాద్ లు ఇద్దరు ప్రచారం చేస్తున్న నేపధ్యంలో ఆదివారం నాడు పరస్పరం దాడి చేసుకొన్నారు. శేరి లింగంపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న మెనిగళ్ల ఆనంద్ ప్రసాద్‌పై మువ్వ సత్యనారాయణ అనుచరులు చెప్పులతో దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.
మువ్వా, ఆనంద ప్రసాద్ ఇద్దరూ టీడీపీ నుండి టికెట్ ఆశించారు. 2014 ఎన్నికల వరకు మువ్వ సత్యనారాయణ టీడీపీలోనే ఉన్నారు. ఆ ఎన్నికల సమయంలో టీడీపీ టిక్కెట్టును ఆశించారు కానీ శేరి లింగంపల్లి టిక్కెట్టు అరికెపూడి గాంధీకి ఇవ్వటంతో మువ్వ సత్యనారాయణ టీడీపీకి గుడ్ ‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత అరికెపూడి గాంధీ కూడ టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. అయితే ఇటీవల కాలంలో మువ్వ సత్యనారాయణ టీఆర్ఎస్ నుండి తిరిగి టీడీపీలో చేరి టికెట్ ఆశిస్తున్నారు.
ఇదే నియోజకవర్గం నుండి టీడీపీ టిక్కెట్టును ఆశిస్తున్న మెనిగళ్ల ఆనంద్ ప్రసాద్‌ కూడా ప్రచారం నిర్వహించారు. ఈ విషయం తెలిసిన మువ్వ సత్యనారాయణ వర్గీయులు అడ్డుకొన్నారు.మెనిగళ్ల ఆనంద్ ప్రసాద్‌పై మువ్వ సత్యనారాయణ వర్గీయులు చెప్పులతో దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది. మెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ ర్యాలీని మువ్వ సత్యనారాయణ అనుచరులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల ఆందోళనల నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామయ్యింది. టీడీపీ లో ముసలం బయటపడింది. పార్టీ పరువు బజారున పడింది.

Sharilingampalli news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *