కర్ణాటకలో బీజేపీకి షాక్ …. సిట్టింగ్ స్థానం కూడా పాయె

Shock News to BJP

కర్ణాటకలో బీజేపీ కి గట్టి షాక్ తగిలింది. మోడీ పాలనపై ఉన్న వ్యతిరేఖత బయట పడింది. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇప్పుడు జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేక చావు దెబ్బ తిన్న బీజేపీ కి ఈ సారి కర్ణాటక ప్రజలు ఝలక్ ఇచ్చారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో కూడా ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. ఈఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకత కు అద్దం పడుతున్నాయి.
3 లోక్‌సభ స్థానాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే వీటిలో కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. మిగతా నాలుగు చోట్ల అధికార కాంగ్రెస్‌-జేడీయూ కూటమి విజయం సాధించింది. ఒక్క శివ మొగ్గ లో మినహాయించి అన్ని స్థానాల్లో అధికారంలో ఉన్న సంకీర్ణ పార్టీలే విజయం సాధించాయి. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలు రాజీనామా చేయడం, రామనగర శాసనసభ స్థానాన్ని సీఎం కుమారస్వామి వదులుకోవడం, జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మృతిచెందడటంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌-జేడీయూ కూటమి భారీ విజయం సాధించింది.
సీఎం కుమారస్వామి రాజీనామా చేసిన రామనగర స్థానంలో ఘన విజయం దక్కింది. అక్కడ బీజేపీ నుండి పోటీ చేసిన ఎల్.చంద్రశేఖర్ పోటీ నుండి తప్పుకోవటంతో జేడీఎస్‌ తరపున బరిలోకి దిగిన సీఎం కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి ఘన విజయం సాధించారు. ఆమె 1,09137 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఇక జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా ఈ ఎన్నికల్లో సిద్ధు కుమారుడు ఆనంద్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది. ఆనంద్‌ బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్‌ కులకర్ణిపై భారీ మెజార్టీతో గెలుపొందారు.
మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో జేడీఎస్‌ అభ్యర్థి శివరామ గౌడ గెలుపొందారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన జేడీఎస్‌ ఎంపీ సీఎస్‌ పుట్టరాజు తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌ నుంచి శివరామ గౌడ బరిలోకి దిగగా కాంగ్రెస్‌ ఆయనకు మద్దతిచ్చింది. అయితే శివరామకు పోటీగా బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి లేకపోవడంతో వార్ వన్ సైడ్ అయ్యింది. జేడీఎస్ గెలిచింది.
ఇక బళ్లారి లోనూ బీజేపీకి ఓటమి తప్పలేదు. బీజేపీ కంచుకోట అయిన ఈ స్థానం లో గెలిచినా బీజేపీ కి పరువు దక్కేది కానీ అక్కడ కూడా ఓటమి పాలయ్యింది. బళ్లారిలో బీజేపీ అభ్యర్థి శాంతపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్ప భారీ మెజార్టీతో గెలుపొందారు.
ఈ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఏకైక స్థానం శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం. శివమొగ్గ ఎంపీగా ఉన్న మాజీ సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో బీజేపీ నుంచి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర బరిలోకి దిగి గెలిచారు. ఈ ఫలితాల ఎఫెక్ట్ ముందు జరిగే యీనికల్లో కూడా రిపీట్ అవుతాయనే భావన వ్యక్తమవుతుంది. మొత్తానికి కర్ణాటక ప్రజలు ఇచ్చిన షాక్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది.

Shock News to BJP, Shock News to BJP Party in Karnataka , Karnataka latest news, Modi latest news , Modi Political news,Congress, JDU

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *