సిక్కుల ఊచకోతపై నిరసన ర్యాలీలో ఉద్రిక్తత

Sikhism latest News

శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ దేశ రాజధానిలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. గురుద్వారా రాకబ్ గంజ్ సాహిబ్ నుంచి ప్రారంభమైన నిరసన ప్రదర్శనలో వేలాది మంది సిక్కులు పాల్గొన్నారు. అయితే ఈ ప్రదర్శనలో కొద్దిపాటి ఉద్రిక్తత చెలరేగింది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
1984 అల్లర్లలో ఊచకోతకు గురైన సిక్కుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ, కాంగ్రెస్, ఇతర నేతలకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఓపెన్ ట్రక్‌ నుంచి సాద్ అధ్యక్షుడు నిరసన ప్రదర్శకులను ఉద్దేశించి మాట్లాడగా, కేంద్ర మంత్రి హర్‌సిమ్రిత్ కౌర్ బాదల్, ఢిల్లీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా సహా పలువురు సాద్ నేతలు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హర్‌సిమ్రిత్ కౌర్ మాట్లాడుతూ, 34 ఏళ్లుగా న్యాయం కోసం సిక్కులు ఎదురుతెన్నులు చూస్తున్నారని అన్నారు. నాటి ఘటనలో వేలాది మంది సిక్కులను ఊచకోత కోశారని, అనేక మంది మహిళలపై అత్యాచారాలు చేశారని, ఎందరో ఇళ్లు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే సిక్కు వ్యతిరేక అల్లర్ల ఘటన మాయని మచ్చ అని అన్నారు. రోడ్లన్నీ సిక్కుల రక్తంతో తడిసిపోయినా ఈరోజు వరకూ న్యాయం జరగలేదని, న్యాయవ్యవస్థ సుమెటో యాక్షన్ ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. సోనియాగాంధీ ఇంటిని ముట్టడించేందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ ఘటన వెనుక ఉన్న కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ కాపాడుతోందని విమర్శించారు.
కాగా, రోడ్డుపై సాద్ లీడర్లు ప్రసంగిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ డ్రోన్‌ను, దానిని నడుపుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రదర్శకులను సైతం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం కొద్దిపాటి ఉద్రిక్తత తలెత్తింది.

Telugu news update, telugu breaking news, tsnews.tv, telugu news, delhi political news,Sikhism latest News, Delhi news update,

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *