స్మార్ట్ ఫోన్ కన్నా టాయిలెట్ నయం

Smartphone dirtier than a toilet

ప్రొద్దున లేస్తే ప్రతి ఒక్కరి చేతిలో వుండే వస్తువు.. మన జీవితంలో మనుషులకంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న వస్తువు అది. అలాంటి వస్తువు అత్యంత మురికిగా, టాయిలెట్ ల కంటే డర్టీ గా ఉంటుందట. అది చాలా డేంజర్ అని పరిశోధకులు చెప్తున్నారు. అవునా… అని నోరెళ్ళబెట్టకండి. మనం నిత్యం వాడే స్మార్ట్ ఫోన్ మీద మల విసర్జనకు కూర్చునే టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువ సూక్ష్మ క్రిములు ఉంటాయట.   తెల్లారిలేస్తే అన్నీ శుభ్రం చేసుకునే మనం ప్రతీక్షణం వాడుతున్న స్మార్ట్ ఫోన్ లను మాత్రం శుభ్రం చేసుకోము.. అందుకే అవి టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువ సూక్ష్మ క్రిములతో ఉండి చర్మ వ్యాధులకు, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయట.  స్మార్ట్ ఫోన్స్ మీద పరిశోధన చేసిన వారు చెప్పిన వివరాలివి.

స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించే వారిలో 35శాతం మంది అసలు దాన్ని శుభ్రం చెయ్యరు. 20మంది స్మార్ట్ ఫోన్ యూజర్లలో ఒక్కరే 6 నెలలకోసారి మొబైల్ స్క్రీన్ ను శుభ్రం చేస్తారట. ఎవరైతే శుభ్రం చెయ్యరో ఆ ఫోన్ స్క్రీన్స్ మీద టాయిలెట్ సీట్ కంటే మూడురెట్లు అధికంగా సూక్ష్మక్రిములు ఉంటాయట. ఈ సూక్ష్మక్రిములను ఆ వస్తువుల వైశాల్యాన్ని బట్టి కొలిస్తే టాయిలెట్ సీట్, ఫ్లష్ మీద 24 యూనిట్లు వుంటే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద 84.9 యూనిట్లు అంటే మూడు రెట్లు అధికంగా ఉంటున్నాయి.ఎరోబిక్ బ్యాక్టీరియా, ఈస్ట్, మౌల్డ్ అనే మూడు రకాల సూక్ష్మక్రిములు స్మార్ట్ ఫోన్ స్క్రీన్లపై ఉండే హానికరమైన బ్యాక్టీరియా అని రీసెర్చర్స్ చెప్తున్నారు.   యూకేలో యువకుల స్మార్ట్ ఫోన్ వాడకంపై పరిశోధనచేసినవారు యూకేలో 5శాతం యువకులు ఒకవారంలో పనిచేసినదానికంటే స్మార్ట్ ఫోన్ మీదనే ఎక్కువ గడుపుతున్నారని, నిద్రలేవగానే ఫోన్ చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. పడుకునే ముందు గతంలో 37 శాతంమంది మొబైల్ చూస్తే ఇప్పుడు 60 శాతానికి పెరిగిందని చెప్పిన పరిశోధకులు ఈ స్మార్ట్ ఫోన్ లలో గడిపేవాళ్ళంతా 35 ఏళ్ళలోపువారే అని తెలిపారు. మన టాయిలెట్ ల కంటే దరిద్రంగా వుండే స్మార్ట్ ఫోన్ లను శుభ్రం చేసుకోకుండా వాడితే మీకే ప్రమాదం.ఈ విషయం తెలిశాక అయినా స్మార్ట్ ఫోన్ వాడకమే కాదు దానిని శుభ్రం చేసుకోవాలనే విషయం గుర్తుంచుకుంటే మేలు.

Smartphone dirtier than a toilet, Your Phone Durty Than Toilet, Tolet Seat Better Than Mobile Phone, Technology Updates, Latest Mobile Updates, Telugu News, Mobile Market Updates

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *