మావోల దాడిలో మృతి చెందిన సాహూ చివరి మాటలు

Sohoo last words

ఛత్తీస్‌గఢ్‌లో నిన్నటి మావోయిస్ట దాడికి సంబంధించి కీలక వీడియో బయటపడింది. మావోయిస్టుల దాడిలో చనిపోయిన డీడీ న్యూస్‌ కెమెరామెన్‌… కాల్పుల సమయంలో తన తల్లితో వీడియో కాల్‌ మాట్లాడాడు. మావోయిస్టులు దాడి చేశారని… ఇక్కడి పరిస్ధితులను బట్టి చూస్తే తాను చనిపోతానేమోనన్న భయంగా ఉందని తన తల్లితో చెప్పాడు. అప్పటికే మావోయిస్టుల దాడిలో గాయపడిన కెమెరామెన్‌ అచ్యుతానంద సాహూ… తన తల్లితో మాట్లాడిన చివరి మాటలు అందర్నీ కంటతడి పెట్టిస్తున్నాయి. తమపై దాడి జరిగిన విషయాన్ని చెబుతూ ఆయన తన సందేశాన్ని మొదలుపెట్టారు. ‘‘ఎన్నికల కవరేజీ కోసం నేను దంతేవాడ వచ్చాను. మేము రోడ్డుమార్గంలో వెళ్తున్నాం. మాతో పాటు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఇంతలోనే ఒక్కసారిగా నక్సలైట్లు మమ్మల్ని చుట్టుముట్టారు..’’ అని శర్మ వివరించారు. ‘‘అమ్మా, ఐ లవ్ యూ… ఈ దాడిలో నేను చనిపోతానేమో,’’ అంటూ ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. అయితే చావంటే తనకు భయం లేదని పేర్కొన్నారు. ‘‘ఎందుకో తెలియదు. మృత్యువు ముందున్నా నాకు భయంగా లేదు. నేను బయటపడేలా కనిపించడం లేదు. మాకు రక్షణగా కొంతమంది జవాన్లు ఉన్నప్పటికీ… నక్సలైట్లు అన్ని దిక్కుల నుండి మమ్మల్ని చుట్టుముట్టారు. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను..’’ అంటూ శర్మ తన సందేశాన్ని ముగించారు.

Sohoo last words  ,Sohoo last words in the Maoist attack ,  video of yesterday Maoist attack in Chattisgarh , Telugu News, Telugu latest News, cameraman Achuthananda Sahoo Maoist attack in the last words he spoke to his mother , Telugu Update News.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *