వాళ్లూ మ‌నుషులే క‌దా..

Srikakulam latest news
మాన‌వ స‌మాజానికి ప్ర‌కృతి చిత్తానికి మ‌ధ్య నిరంత‌రం యుద్ధం సాగుతూనే ఉంటుంది
యుద్ధంలో ఓడిపోవ‌డమో గెలవ‌డమో అన్న‌ది అటుంచితే ఏటా కోలుకోలేనంత న‌ష్టం
ఈ  ప్రకృతే ఇచ్చిపోతోంది. శాపంగా మారుతున్న ఈ వైనం సిక్కోలు అభివృద్ధికో విఘాతం
ఈ తరుణాన ఏకంగా 18 మండ‌లాల‌ను అత‌లాకుత‌లం చేసిన  తిత్లీ తుఫాను ప్ర‌భావం ఇప్పట్లో తీరిపోదు
కానీ బాధిత కుటుంబాల‌కు చేయూనిద్దాం అనుకుంటున్న యంత్రాంగానికి ఎన్నో స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి
ఈ త‌రుణాన ఉద్యోగులు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్న వైనాన్నీ విస్మ‌రించ‌రాదు.
వ్య‌వ‌సాయ శాఖ జేడీ రామారావు, ఐసీడీఎస్ పీఓ రాజేశ్వ‌రి ఇప్పుడు అనారోగ్యం పాలై ఉన్నారు.వీరితో పాటూ ఇంకొంద‌రు వారికి మ‌ద్ద‌తుగా నిలివాల్సింది ప్ర‌జ‌లే..వారి ఆరోగ్యం గురించి వాక‌బు చేసి స‌రైన వైద్యం అందేలా చేయాల్సింది ప్ర‌భుత్వాలే.. ఉన్న‌తాధికారులు స‌రే చిన్న  చిన్న ఉద్యోగుల‌కూ ఆరోగ్య స‌మస్య‌లు చుట్టుముడుతున్నాయి. వారు కూడా ఎవ్వ‌రికీ ఏమీ చెప్పుకోలేక‌పోతున్నారు. ఈ ద‌శ‌లో ఒత్తిడి లేకుండా ఉద్యోగం చేసుకునేలా స‌రైన అనుకూల వాతావ‌ర‌ణం క‌ల్పించాల్సిన బాధ్య‌త కూడా ప్ర‌భుత్వానిదే.. ప్రాణం ఎవ్వ‌రిదైనా ప్రాణ‌మే క‌దా క‌నుక వీరి విష‌య‌మై కూడా మానవ‌త‌తో స్పందిస్తే నాయ‌కులు మ‌రింత మేలు చేసిన వార‌వుతారు.
తుఫాను అంటే తీరం హ‌డ‌లిపోతోంది తుఫాను అంటే  సిక్కోలు హ‌డ‌లిపోతోంది. అవును తిత్లీ విల‌యం నుంచి కోలుకోవ‌డం క‌ష్టం. అలానే తిత్లీ బాధితుల‌కు సాయం అందిద్దాం అని వ‌చ్చిన అధికారులులో కొంద‌రు కోలుకోవడానికి కూడా ఇంకొన్ని రోజులు కావాలి. కానీ కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రు సస్పెన్ష‌న్ల‌కు గురి అవుతున్నారు. ఇంకొంద‌రు భ‌యాల‌కు లోనై తీవ్ర ఒత్తిడికి లోనై డిప్రెష‌న్ దారిన ప‌డుతున్నారు.ఇలాంటి స‌మ‌యాల్లో అధికారుల‌కు అండ‌గా ప్ర‌భుత్వం నిల‌వాలి. బాధితులెంతో అధికారులూ అంతే.!
మ‌నం అంతా నిష్టూరాలు ఆడుతాం.. మ‌నం అంత‌గా  నిజంగా నిజాల‌ను గుర్తించ‌డం మానేశాం. పాపం వారెవ్వ‌రో రోడ్డున ప‌డితే బాధ‌ప‌డ్డాం బాగుంది అదే స‌మ‌యాన ఓ ప్ర‌భుత్వోద్యోగి క‌ష్టం కూడా క‌ష్ట‌మే క‌దా! పాపం అని అన‌డం మానేసి అర‌వ‌డం మొద‌లుపెడ‌తాం.సాయం ద‌క్క‌లేద‌నో ద‌క్కినా చాల్లేద‌నో తెగ మ‌థ‌న‌ప‌డ‌తాం. కానీ అస‌లైన హీరోలు వీరే క‌దా.. అన్నం నీరు ముట్ట‌డం మానేసి తీవ్ర వ్యాధులు బాధిస్తున్నా మందులు వేళ‌కు వేసుకోక రోడ్డున ప‌డ్డ వీరంతా మంచం ప‌ట్టిన వీరంతా నిజ‌మైన హీరోలు వీరికి త‌ప్ప‌క వంద‌నాలు చెప్పాలి..  సెల్యూట్ చేయాలి.
ఆయ‌నొక వ్య‌వ‌సాయ శాఖ అధికారి కావొచ్చు ఆయ‌నదో ఐఏఎస్ స్థాయి కావొచ్చు ఎవ‌రైతేనేం మ‌న కోసం ప‌రిశ్ర‌మించిన అధికారుల‌కు అంతా మేలే జ‌ర‌గాలి. ప్ర‌భుత్వాధీశులు కూడా మాన‌వ‌తా  దృక్ప‌థంతో చూడాలి. కానీ ఎందుక‌నో అటువంటి  చ‌ర్య‌లు ఇంకా తీసుకుంటున్న దాఖ‌లాలు న‌మోదుకావ‌డం లేదు. సంబంధిత ఉన్నత వ‌ర్గాల స్పంద‌న అంతంత మాత్ర‌మే అవుతోంది. ఈ త‌రుణాన బాధితులంతే ఈ అధికార‌లూ అంతే..
వీరి ఆరోగ్యం కోసం కూడా మ‌నం ప్రార్థించాలి. వీరి మేలు కోరి కూడా మ‌నం ప‌నిచేయాలి. చేస్తున్నామా?
తిత్లీ గాయాలు కోలుకోనియ‌కుండా చేస్తున్నాయి కొన్నిచోట్ల
కోలుకున్న చోట ఇంకాస్త  కొత్త ఇబ్బందులేవో చుట్టుముడుతున్నాయి
అధికార వ‌ర్గాల‌కు ఈగాయాలు మ‌రింత బాధిస్తున్నాయి
ఓ ద‌ఫేదారు స్థాయి నుంచి ఓ ఐఏఎస్ వ‌ర‌కూ అంతా మ‌నోవ్య‌ధ‌కు లోన‌వుతున్న వారే
అంతా మ‌నుషులే మ‌ళ్లీ చిన్న‌వారు పెద్ద‌వారు అంటూ విభ‌జ‌న రేఖ‌లు ఎందుక‌నో.. అర్థం కాదు. అంతా మ‌న‌వారే మ‌ళ్లీ నా వార‌నో ప‌రాయివార‌నో ఇలాంటి విభేదం ఎందుక‌నో.. మనుషుల‌కు గాయాలు మ‌నుషులకు బంధాలు అన్నీ ఏక కాలంలోనే దాడి చేసిన సంద‌ర్భాలు అనేకం ఉండ‌వ‌చ్చు.
తిత్లీ తుఫాను వ‌చ్చినా మ‌రో తుఫాను ప‌ల‌క‌రించినా ఈ  ప్రాంతం వ‌ణికిపోతే అదే రీతిన అధికారులు కూడా బెంగ‌టిల్లుతున్నారు. ఓ  విద్యుత్ లైన్ మేన్ స్తంభం నుంచి ప‌డిపోయి తీవ్ర గాయాల‌యిన ఘ‌ట‌న ఆ ఉద్దానంలోనే మొన్న‌టి వేళ చోటుచేసుకుంది. ఓ ఐసీడీఎస్ పీఓ తీవ్రంగా అస్వ‌స్థ‌త‌కు గురై కుప్ప‌కూలి పోయింది మ‌రి! వీరంతా ఎవ‌రు? బాధితుల‌ను ఆదుకోవాల‌న్న విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా బాధితులుగా మిగిలిన‌వారు. మ‌రి వీరెందుకు ప్ర‌జ‌ల‌కు ప‌ట్ట‌డం లేదు ఇది క‌దా సిస‌లు ప్ర‌శ్న.
Srikakulam latest news, Sikakulam Update News, Titli toofan News, Telugu News, AP Latest news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *