ఇన్ క్రెడిబుల్ థియేట‌ర్ : ఐనా.. రోజులు మార‌లేదు..

Srikakulam Latest News
రంగ‌స్థ‌లం-2018
ఏడాది చివ‌ర్లో ఓ పండుగ
మూడ్రోజుల పండుగ రాష్ట్ర స్థాయి నాట‌కోత్స‌వం
శ్రీ‌కాకుళ రంగ‌స్థ‌ల క‌ళాకారుల స‌మాఖ్య చేసిన ప్ర‌య‌త్నం
రెండు ద‌శాబ్దాల ప్ర‌యాణం పూర్తైన సంద‌ర్భంగా..
చిన్న సంస్థ పెద్ద బాధ్య‌త అందాక స‌రే..ఎవ‌రెవ‌రో సాయం అందిస్తే నాట‌కం ఆడిన రోజులున్నాయి. ఎవరెవ‌రో మాన‌వ‌త్వం చాటితే న‌లుగురికి పెన్ష‌న్లు అందించిన రోజులున్నాయి. ఇవ‌న్నీ శ్రీ‌కాకుళ రంగ స్థ‌ల క‌ళాకారుల స‌మాఖ్య‌కు అల‌వాటుగా ఉన్న ప‌నులు.ఆ సంస్థ‌తో సావాసం చేస్తున్న క‌ష్టాలు..నాట‌కంను బ‌తికించి, రేప‌టి త‌రానికి దీని ఔన్న‌త్యం తెల‌పాల‌న్న ఓ ప్ర‌య‌త్నం వారిది.దానికి వార‌థిగా ఎంద‌రెంద‌రో! మ‌రి! నాటకం ఎలా ఉంది??
మాజీ మంత్రి ధ‌ర్మాన, మాజీ చైర్ ప‌ర్స‌న్ మెంటాడ వెంక‌ట ప‌ద్మావ‌తి ఇంకొంద‌రు త‌మవంతు సాయం అందిస్తామ‌న్నారు. రంగ‌స్థ‌ల క‌ళాకారుల‌కు, ర‌చ‌యిత‌ల‌కు త‌న త‌ర‌ఫున అన‌గా త‌మ  ట్ర‌స్టు త‌ర‌ఫున శిక్ష‌ణ ఇప్పించేందుకు ముందుకువ‌చ్చారు.ఇదీ బాగుంది. ఇవాళ ఓ చ‌క్క‌ని ఆడిటోరియం లేని స్థితిలో శ్రీ‌కాకుళం ఉంద‌ని, ఈ ప‌రిస్థితి మారాల్సిందేనని ఇప్ప‌టి పాల‌కులు ఒక‌ప్ప‌టి పాల‌కులు చెబుతూనే ఉన్నారు.వీటి తీరెలా ఉన్నా నాట‌క ప్రాభ‌వం మాత్రం అలానే ఉన్నా ఇంకా ఏదో అది కోల్పోయింద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.
అవును ఇప్పుడు నాటకం ఎలా ఉంది.. అచ్చం పాత సీసాలో కొత్త సారాలా.. ఇంకా ఇప్పుడు నాట‌కం ఎలా ఉంది ఆధునికీక‌ర‌ణ‌కు దూరంగా..
ప్ర‌యోగ‌వాదానికి దూరంగా ఉంది.. ఈస్థితిలో నాట‌క స‌మాజాలు మేల్కొంటున్నాయా.. లేకా పాడిన పాటే పాడి నాలుగు అవార్డులు చూసి మురిసిపోతున్నాయా.. వీటిని కూడా ఆలోచించాలి.ఒప్పుకోవాలి నాట‌కానికి ఆద‌ర‌ణ త‌గ్గ‌లేద‌ని.. అదే స‌మ‌యంలో నాట‌క స‌మాజం ప్ర‌యోగ రీతుల‌కు అనుగుణంగా ఆధునిక వాదానికి అనుగుణంగా లేద‌ని.. ఈ స‌మ‌యంలో ఈ పాటి విమ‌ర్శ ఆత్మావ‌లోక‌నం త‌ప్ప‌నిస‌రి!
ఇంకా మ‌నం క‌న్యాశుల్యం నాట‌క గొప్ప‌ద‌ని గుర‌జాడ రాత అద్భుత‌మ‌ని ఆగిపోతున్నామేమో.. ఆ క‌థ జ‌రిగి 150 ఏళ్లు దాటినా ఇంకా ఆ వెలుగును చూసి మురిసిపోతున్నామేమో! కొత్త రాత‌గాళ్లు ఆలోచించాల్సింది సీరియ‌ల్స్ కు ద‌గ్గ‌ర‌గా పంచ్ డైలాగ్స్‌కు ద‌గ్గ‌ర‌గా నాట‌కాల‌ను
రూపొందించ‌డం ఏమంత స‌బ‌బు కాద‌ని! కానీ మ‌న ద‌గ్గ‌ర నాట‌కం అలానే ఉంది. కొన్ని చోట్ల నాట‌కం పేరిట రికార్డు స్థాయి రికార్డింగ్ డ్యాన్సులు జ‌రుగుతున్నాయ‌నుకోండి అది వేరే సంగ‌తి.. కానీ రాష్ట్ర స్థాయి పోటీలకు స‌రితూగే నాట‌కాలు ఏవీ లేవ‌న్న‌ది ఒప్పుకోద‌గ్గ వాస్త‌వం. ఓ విధంగా స‌మాఖ్య క‌ష్టం ఫ‌లించ‌లేద‌న్న‌ది ఎవ్వ‌రు ఒప్పుకోకున్నా అంగీక‌రించ‌ద‌గ్గ‌ర నూరుపైస‌ల నిజం.  నాట‌కం వ‌ర్థిల్లాలి.. స‌మాజం వ‌ర్థిల్లాలి అని ..
నిన‌దించ‌డంతోనే స‌రి అనుకుంటే ఇంకేం చేయలేం. ఈ స్థితిలో నిజాన్ని గుర్తించ‌క‌నో స్తుతిని నెత్తికెక్కించుకునో ఉంటే  చేసేది ఏమీ లేదు. తెలుగు నాట‌కానికి మునుప‌టి ప్రాభ‌వం రావాల‌న్నా.. ఓ చిత్త‌శుద్ధితో కూడిన ప్ర‌య‌త్నం విమ‌ర్శ విశ్లేష‌ణ ఇప్పుడు త‌ప్ప‌నిస‌రి! ఇవాళ సుర‌భి నాట‌క స‌మాజం కూడా నాట‌కాన్ని ఫ‌క్తు సినిమాకు అనుక‌ర‌ణ రూపంగా మార్చేసింది.అది కూడా ఏమంత ఆమోద‌యోగ్యం కాదు.. అందుక‌నో ఎందుక‌నో
గ‌తం ద‌గ్గ‌రే మ‌నం ఆగిపోతున్నాం..ఆ ఆన‌వాళ్ల‌ను గుర్తిస్తూ గొప్ప‌ల‌కు పోతున్నాం.ఏదేమైనా గొప్ప నాట‌కం ప్రాభ‌వాన్ని అందుకునే నాట‌కం
రావాల‌ని ఆశించ‌డం అత్యాశే కావొచ్చు.. కానీ అసాధ్యం కాదు క‌దా!
(మూడ్రోజుల పాటు శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రంలో జ‌రిగిన రాష్ట్ర స్థాయి నాట‌క పోటీల‌కు వెళ్లి వ‌చ్చాక‌)
Srikakulam Latest News ,

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *