స్టార్ షట్లర్ పీవీ సింధు కు షాక్

భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు పెద్ద షాక్. ఎన్నో అంచనాలతో డెన్మార్క్ ఓపెన్‌లో బరిలో దిగిన సింధు తొలి రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. డెన్మార్క్ ఓపెన్ మహిళల సింగిల్స్ తొలిరౌండ్లోనే ప్రపంచ మూడో ర్యాంకర్ పీవీ సింధు పోటీ ముగిసింది.

కోపెన్ హాగన్ వేదికగా జరిగిన తొలిరౌండ్ పోటీలో చైనా ప్లేయర్ చెన్ యూఫే చేతిలో సింధు 17-21, 21-16, 18-21తో ఓటమి చవిచూసింది. తొలిగేమ్ ను 17-21తో చేజార్చుకొన్న సింధు రెండో గేమ్ ను 21-16తో సొంతం చేసుకోడం ద్వారా సమఉజ్జీగా నిలిచింది. అయితే నిర్ణయాత్మక ఆఖరి గేమ్ ను యూఫే 21-18తో నెగ్గడం ద్వారా 2-1 విజయంతో రెండోరౌండ్లో అడుగుపెట్టింది. ప్రస్తుత సీజన్లో కామన్వెల్త్ గేమ్స్ రజతం సాధించడం మినహా సూపర్ సిరీస్ టోర్నీల్లో  సింధు ఘోరపరాజయాలు ఎదుర్కొంటూ వస్తోంది.

star shettler pv sindhu news,shettler pv sindhu news,pv sindhu loses match in denmark,star shettler pv sindhu loses match in denmark

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *