సుబ్రహ్మణ్యపు`రం నాకు చాలా ప్రత్యేకం

Subrahmanyapuram is very special to me

‘‘సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్’’ పతాకం పై బీరం సుధాకర రెడ్డి నిర్మించిన ‘సుబ్రహ్మణ్యపురం’.  సెన్సిబుల్ హీరో సుమంత్ , ఈషారెబ్బ జంటగా నటించిన ఈమూవీతో  సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  డిసెంబర్ 7న (శుక్రవారం) ఈ సినిమా గ్రాండ్  రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈషా రెబ్బ ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
దర్శకుడు సంతోష్ కథ చెప్పగానే నాకు సంతోష్ రెండు గంటలు కథ చెప్పాడు.. అతను కథ చెపుతున్నప్పుడు నేను విజువలైజ్ చేసుకున్నాను అది నాకు బాగా నచ్చింది. అందుకే ఓకే చెప్పాను. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అన్ని రకాల సినిమాలు చూస్తాను. కానీ నెక్ట్స్ ఏమవుతుంది అని టెన్సన్ పడుతూ సినిమాలు చూడటం నాకు ఇష్టం. ఆ ఎలిమెంట్స్ సుబ్రహ్యణ్యపురం లో చాలా ఉన్నాయి.
నా పాత్ర ఎలా ఉంటుందంటే:
ఊరంటే చాలా ఇష్టపడే అమ్మాయి, తనకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అందులోనూ తండ్రిని ఎక్కువుగా ఇష్టపడుతుంది. ఇంకా చాలా భక్తురాలు, కానీ  ఈ సినిమాలో కనిపించేంత భక్తురాలను కాదు. ఇందులో లవ్ స్టోరీ ఉంటుంది కానీ అది థ్రిల్లర్ ఎక్స్ పీరయన్స్ ని  డిస్ట్రర్బ్ చేయదు.
సుబ్రహ్మణ్యపురం టీం లో ఒక ఎనర్జీ ఉంది:
ఈ టీంతో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఆర్.కె. ప్రతాప్ సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర మ్యూజిక్ సుబ్రహ్మణ్యపురం కు పెద్ద అసెట్ గా నిలిచాయి.  దర్శకుడు సంతోష్ మొదటి సినిమా అయినా అన్ని క్రాప్ట్ ల నుండి బెస్ట్ అవుట్ పుట్ ని తీసుకున్నాడు. అతను కథను డీల్ చేసిన విధానం చాలా బాగుంది.
షూట్ చేసినప్పడు థ్రిల్లవ్వలేదు:
షూట్ చేస్తున్నప్పుడు అంత భయం అనిపించలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఆ టోటాలిటీ వస్తుంది.  అది చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది.
సుమంత్ కంప్లీట్ ఆపోజిట్ గా కనిపిస్తాడు:
నేను భక్తురాలుగా కనిపిస్తాను సుమంత్ కంప్లీట్ అపోజిట్ రోల్ ప్లే చేసాడు. వారి అభిప్రాయాల మద్య ఘర్షణ ఉంటుంది.  దేవుడు ఉన్నాడని నమ్మే అమ్మాయికి , దేవుడు పై రిసెర్చ్ చేసే అబ్బాయి కి మద్య లవ్ ఫీల్ ఎలా కలిగింది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
సుమంత్  తో వర్క్ చేయడం చాలా కంపర్టబుల్:
సుమంత్ సినిమాలలో గోదావరి, గోల్కొండ హైస్కూల్,  మళ్లీరావా సినిమాలు నాకు ఇష్టం. ఆయన నటన సహాజంగా ఉంటుంది అది నాకు నచ్చుతుంది. షూటింగ్ అంతా చాలా బాగా జరిగింది.
పని అడిగితే తప్పులేదు కదా..?:
నాకు వచ్చిన కథలలో నాకు నచ్చినవి ఎంచుకుంటున్నాను. ఒక పాత్రకు నేను ఉంటే బాగుంటుంది అనుకునే పాత్రలను చేస్తున్నాను. నాకు కొత్త దర్శకులతో, కొత్త కాంబినేషన్స్ లో వర్క్ చేయాలని ఉంటుంది. నేను అలాంటి పాత్రలు కోసం అప్రోచ్ అవుతాను, పని అడగటం లో తప్పు లేదు కదా.. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు  ఇప్పుడు పెరుగుతున్నాయి.
సుధాకర రెడ్డి అభిరుచి గల నిర్మాత:
నిర్మాత అంటే ఓన్లీ బడ్జట్ లోనే ఇన్వాల్వ్ అవుతారు అనుకుంటారు. కానీ సుధాకర రెడ్డి గారు  సినిమా కథ చర్చలలో కూడా పాల్గోనేవారు, రోజూ షూట్ కి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకునే వారు. సుబ్రహ్మణ్యపురం అవుట్ పుట్ ఇంత ఎఫెక్టివ్ గా రావడానికి ఆయన ఇచ్చిన సపోర్ట్ కారణం.
మొదటి సినిమా దర్శకుడులా పనిచేయలేదు:
సంతోష్ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. అతను బౌండ్ స్ర్కిప్ట్ తో వచ్చాడు. ప్రతి సీన్ అతను వివరించే విధానం చాలా క్లారిటీ గా ఉంటుంది. ఇందులో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉండేలా డిజైన్ చేసుకున్నాడు.
మొదటి సినిమా దర్శకుడిలా అనిపించలేదు.
 భగవంతుడి ఉనికి అనేది నమ్మకం అనే పునాదుల మీద ఉంటుంది. ఆ నమ్మకం లేని వ్యక్తి భగవంతుడిపై  చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి. కాపాడవలసిన భగవంతుడి ఆగ్రహాం తట్టుకోవడం సాధ్యం అవుతుందా..?  ‘‘సుబ్రహ్మణ్యపురం’’ లో దాగున్న రహాస్యం ఏంటి..?  ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన చిత్రం ‘‘సుబ్రహ్మణ్యపురం’’. విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే  ‘‘సుబ్రహ్మణ్యపురం’’ ఇండస్ట్రీ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గా మారింది. బాహుబలి, గరుడ వేగ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన టీం  ‘‘సుబ్రహ్మణ్యపురం’’ కు వర్క్ చేసారు. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  లెజండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం పాడిన థీమ్ సాంగ్ హైలెట్ గా నిలిచింది.
Subrahmanyapuram is very special to me , Eesha Rebba Heroine Latest news , Subrahmanyapuram Movie News, Telugu Movie News, Telugu latest movie

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *