తొలి వాణిజ్య అంతరిక్ష యాత్రలో సునీతా

Sunita Williams Updates

తొలి వాణిజ్య అంతరిక్ష యాత్రలో సునీతా

సునీతా విలియమ్స్ అమెరికా 2019లో చేపట్టనున్న తొలి మానవ సహిత వాణిజ్య అంతరిక్ష యాత్రకు వెళ్లే వ్యోమగాముల  టీంలో భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్ కూడా ఉన్నారు. మరో 8 మంది వ్యోమగాములతో కలసి ఆమె అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ‘బోయింగ్‌’ సంస్థ తయారుచేసిన బోయింగ్‌ సీఎస్‌టీ–100, స్పేస్‌ ఎక్స్‌ సంస్థ రూపొందించిన డ్రాగన్ క్యాప్యూల్స్ ద్వారా ఈ వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సానా పంపనుంది. 2011లో స్పేస్‌ షటిల్‌ కార్యక్రమం ముగిసిపోవడంతో అమెరికా భూభాగం నుంచి ఇప్పటివరకూ వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపలేదు.తమ సహకారంతో బోయింగ్, స్పేస్‌ ఎక్స్‌ సంస్థలు అభివృద్ధి చేసిన ఆధునిక అంతరిక్ష నౌకల సహాయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని నాసా తెలిపింది. సునీతా, మరో వ్యోమగామి జోష్‌ కస్సాడాతో కలసి స్టార్‌ లైనర్‌ నౌక ద్వారా అంతరిక్ష కేంద్రంపై అడుగుపెడతారని తెలిపింది.గతంలో అంతరిక్షంలో 321 రోజులపాటు గడిపిన సునీతా తిరిగి 2012లో భూమిపై అడుగుపెట్టారు. ఇక స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌క్యాప్సూల్‌ మిషన్‌లో వ్యోమగాములు రాబర్ట్‌ బెహ్న్‌కెన్, డగ్లస్‌ హర్లీ అంతరిక్ష కేంద్రానికి వెళ్తారు. వాస్తవానికి ఈ ఏడాది నవంబర్ లోనే అంతరిక్షంలోకి వీటి ప్రయాణం ప్రారంభం కావాల్సి ఉన్నా…వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు నాసా తెలిపింది. ఈ విమానాల్లో వ్యోమగాముల సురక్షిత ప్రయాణానికి అమసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.

Sunita Williams Updates, Sunita Williams News, America Latest News, International News, First 9 Astronauts to Fly

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *