మృతదేహానికి మూడు రోజులు వైద్యం చేసిన ఘ‌నులెవ‌రు?

TamilNadu hospital
ఠాగూర్ సినిమా గుర్తుందా? చనిపోయిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తే.. బతికే ఉన్నాడని చెప్పి చికిత్స చేసి రూ.5 లక్షలు బిల్లు వేస్తారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే తమిళనాడులో జరిగింది. చికిత్స చేస్తుండగానే రోగి మృతి చెందినప్పటికీ ఆ విషయం దాచిపెట్టి డబ్బుగుంజింది. చికిత్స పేరుతో మృతుని బంధువుల నుంచి రూ. 3 లక్షలు వసూలు చేయడంతోపాటు మరో రూ.5 లక్షలు కట్టాలని హామీపత్రం కూడా రాయించుకుంది. నాగపట్నం జిల్లా కీళాయిసానూరుకు చెందిన శేఖర్‌ (55) రవాణా శాఖలో డ్రైవర్‌. అనారోగ్యం బారిన పడిన ఆయన్ను ఈనెల 7న నాగపట్నంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. ఆరోగ్యం క్షీణించడంతో మరునాడే తంజావూరులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ముందుగా రూ.2.50 లక్షలు కడితేనే చికిత్స ప్రారంభిస్తామని అక్కడి వైద్యులు చెప్పడంతో వెంటనే చెల్లించారు. ఈ నెల 28వ తేదీ వరకు పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బంధువులు సిద్ధపడ్డారు. చికిత్స కోసం అయిన రూ. 5 లక్షలు చెల్లించాలని యాజమాన్యం పట్టుబట్టడంతో బంధువులు హామీ పత్రం రాసిచ్చారు. తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించగా శేఖర్‌ మూడురోజుల క్రితమే చనిపోయాడని వైద్యులు తేల్చారు. దీంతో అతని బంధువులు మండిపడ్డారు. చికిత్స పేరుతో డబ్బులు గుంజడమే కాకుండా శేఖర్‌ మృతికి ఆస్పత్రి కారణమైందని, పైగా ఆ విషయం దాచి పెట్టిందంటూ ఆస్పత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

private hospital latest controversies 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *