TAXI WALA REVIEW

Taxi wala Movie Review
విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో. `పెళ్ళిచూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం` చిత్రాల‌తో క్రేజ్ ద‌క్కించుకున్న ఈ యువ క‌థానాయ‌కుడుకి నోట కాస్త బ్రేక్ వేసినా.. టాక్సీవాలాతో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు విజ‌య్‌. గ్రాఫిక్స్ సరిగ్గా లేక‌పోవ‌డం వంటి సాంకేతిక కార‌ణాల‌తో ఇబ్బంది ప‌డుతున్న చిత్ర యూనిట్‌కి సినిమా పైర‌సీ అయ్యి మ‌రో షాకిచ్చింది. ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా.. సినిమా పైర‌సీ అయిన త‌ర్వాత ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు క‌దా.. మొత్తానికి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చారు. మ‌రి టాక్సీవాలా ప్రేక్ష‌కుల‌ను ఏ మేర ఆక‌ట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం.
సెన్సార్ :  యు/ఎ
వ్య‌వ‌థి:  132 నిమిషాలు
బ్యాన‌ర్స్‌:  జి.ఎ2 పిక్చ‌ర్స్‌, యు.వి.క్రియేషన్స్‌
న‌టీనటులు:  విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప్రియాంక జ‌వాల్క‌ర్‌, మాళ‌వికా నాయ‌ర్‌, మ‌ధునంద‌న్‌, సిజ్జు, ఉత్తేజ్‌, యమున‌, క‌ల్యాణి, ర‌విప్ర‌కాశ్, ర‌వివ‌ర్మ‌ త‌దిత‌రులు
సంగీతం:  జేక్స్ బిజాయ్‌
ఛాయాగ్ర‌హ‌ణం:  సుజిత్ సారంగ్‌
కూర్పు:  శ్రీజిత్ సారంగ్‌
స్క్రీన్‌ప్లే, మాట‌లు:  సాయికుమార్ రెడ్డి
నిర్మాత‌:  ఎస్‌.కె.ఎన్‌
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం:  రాహుల్ సంక్రిత్యాన్‌
క‌థ‌:
శివ ఉద్యోగం కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. చిన్న చిన్న ఉద్యోగాలు అత‌నికి చాలా క‌ష్టంగా అనిపిస్తాయి. దాంతో ఓ క్యాబ్ కొని డ్రైవ‌ర్‌గా డ‌బ్బు సంపాదించాల‌నుకుంటాడు. అన్న‌(ర‌విప్ర‌కాశ్), వ‌దిన‌(క‌ల్యాణి)లను డ‌బ్బు అడుగుతాడు. వ‌దిన త‌న న‌గ‌లు అమ్మి డ‌బ్బులిస్తుంది. దాంతో శివ ఓ సెకండ్ హ్యాండ్ కారు కొంటాడు. స్నేహితులు(మ‌ధునందన్‌, వినోద్‌)తో ఎంజాయ్ చేస్తుంటాడు. అమ్మాయి(ప్రియాంక జ‌వాల్క‌ర్‌)తో ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మార‌తుంది. ఓరోజు త‌న కారులో దెయ్యం ఉంద‌ని శివ‌కు తెలుస్తుంది. అత‌ని స్నేహితులిచ్చిన స‌ల‌హాతో దాన్ని వ‌దిలించుకోవాల‌ని చూసిన కుద‌ర‌దు. చివ‌ర‌కు త‌న‌కు కారు అమ్మిన వ్య‌క్తినే కలుసుకోవాల‌నుకుంటాడు. అప్పుడేం జ‌రుగుతుంది?  శివ‌కు ఎలాంటి నిజాలు తెలుస్తాయి?  శిశిర ఎవ‌రు?  శివ కారుకు, శిశిర‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్ల‌స్ పాయింట్స్‌:
– విజ‌య్  దేవ‌ర‌కొండ స‌హా న‌టీన‌టులు
– సినిమాటోగ్ర‌ఫీ
– బ్యాగ్రౌండ్ స్కోర్
మైన‌స్ పాయింట్స్‌:
– సెకండాఫ్ సాగ‌దీసిన‌ట్లుగా ఉండ‌టం
– లాజిక్స్‌కి దూరంగా కొన్ని స‌న్నివేశాల రూప‌క‌ల్ప‌న‌
స‌మీక్ష:
ఇందులో ముందుగా న‌టీన‌టులు గురించి చెప్పుకోవాలి. విజయ్‌దేవ‌ర‌కొండ  శివ అనే క్యాబ్ డ్రైవ‌ర్ పాత్ర‌లో చాలా ఈజ్‌తో నటించాడు. విజ‌య్ న‌ట‌న‌తో పాటు మ‌ధునంద‌న్‌, వినోద్ పాత్ర‌ల వ‌ల్ల సిచ్యువేష‌న‌ల్ కామెడీ జ‌న‌రేట్ అయ్యింది. ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా ల‌వ్, కామెడీ స‌న్నివేశాల‌తో సాగుతుంది. ఇంట‌ర్వెల్ బ్లాక్ బావుంది. కారులో దెయ్యం హ‌త్య చేసే స‌న్నివేశంలో కారు చేజ్ ఆక‌ట్టుకుంటుంది. సెకండాఫ్ విష‌యానికి వ‌చ్చేస‌రికి అస‌లు కారులోని దెయ్యానికి, అస్ట్రా సైన్స్‌కు ఉన్న‌లింకేంటి? అనే విష‌యాన్ని రివీల్ చేస్తూ వ‌చ్చారు. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్ ఎమోష‌న‌ల్ సీన్స్‌తో క‌నెక్ట్ చేసి చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం హీరో విజ‌య్ ఇమేజ్‌కి .. ఈ సీన్స్‌కు ప్రేక్ష‌కులు ఎంత మేర క‌నెక్ట్ అవుతారనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ప్రియాంక జ‌వాల్క‌ర్ పాత్ర మేర చ‌క్క‌గా న‌టించింది. ర‌విప్ర‌కాశ్‌, క‌ల్యాణి, సిజ్జు, య‌మున‌, మ‌ధునంద‌న్‌, వినోద్ తదిత‌రులు వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించారు. రాహుల్ సంక్రిత్యాన్ కారులోని ఆత్మ‌కు, ఆస్ట్రా సైన్స్‌కు లింకు పెట్ట‌డం.. క్లైమాక్స్‌లో ఆ లింకు తెగిపోతే.. క‌ల‌పే సీన్స్ ఎమోష‌న‌ల్‌గా ఉంటాయి. సుజిత్ సారంగ్  కెమెరా వ‌ర్క్ బావుంది. జేక్స్ బిజోయ్ సంగీతంలో మ‌ను మాట వినదు పాట చాలా బావుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది.
బోట‌మ్ లైన్:  టాక్సీవాలా.. కామెడీ ట‌చ్‌తో ఆక‌ట్టుకునే థ్రిల్ల‌ర్
రేటింగ్‌: 3/5
Taxi wala Movie Review , Taxi wala telugu movie review, vijay devarakonda latest telugu movie, Telugu Latest movie, Director Rahul

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *