టీడీపీ ని భ‌య‌పెడుతున్న జ‌న‌సేన

TDP was Beware of Janasena
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచి ఏకంగా టీడీపీ, వైసీపీ నేతలను పరుగులు పెట్టిస్తున్నారు. అందరికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రభావం టీడీపీ నేతల పై ఎక్కువగా పడుతోందని అంటున్నారు.పవన్ కళ్యాణ్ టీడీపీని టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ నేతల గుండెల్లో అలజడి రేపుతుంది.
ఇప్పటికే ఎక్కడ తమ ఓటు బ్యాంకు కు గండి పడుతుందాయని భయపడుతున్న టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలతో తెగ కంగారు పడుతున్నారట. ఒకపక్క టీడీపీ  అటు బీజేపీ ,పవన్ లకు దూరం అయ్యి అనైతిక పొత్తుతో తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంటే ఇప్పుడు పవన్ ప్రభావం టీడీపీ కూటమిలో కీలకమవుతోందట..ఈ వార్త చెప్పింది కూడా ఎవరో కాదని సాక్షాత్తు బాబు ఇంటిలిజెన్స్ సర్వేనే అంటూ టాక్ వినపడుతోంది. గతంలోలా ఇప్పుడు టీడీపీ కి పవన్ ,బీజేపీ మద్దతు లేదు..దాంతో టీడీపీ కి వ్యతిరేకం అయ్యే ఓటు బ్యాంక్ అదేసమయంలో టీడీపీ ఎప్పుడూ పడే కాపు వర్గం ప్రజల ఓటు బ్యాంక్ ఈ రెండూ దూరం అవనున్నాయట.
ఆ రెండు వర్గాల ఓట్లు పవన్ కి పడటం పక్కా అంటున్నారు…ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ బాబుకి విన్నపించిందట. ఇదిలాఉంటే గోదావరి జిల్లాలలో అదేవిధంగా కృష్ణా జిల్లా లోని నియోజకవర్గాలలో సైతం పవన్ కళ్యాణ్ కి Inఎంతో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అంతేకాదు నెల్లూరు , ఉత్తరాంధ్ర జిల్లాలలో ఈ సారి పవన్ కళ్యాణ్ కి అభిమానుల ఓటు బ్యాంక్ భారీగానే ఉండటంతో పాటు చంద్రబాబు కాంగ్రెస్ తో పెట్టుకున్న పొత్తు రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని ఇంటిలిజెంట్ సైతంం నివేదికను ఇచ్చిందట.. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చటం గమనార్హం..

Today Deals on amazon Check Out Here 

Buy more books form amazon in discount Sale Click Here

Telangana politics, updates of politics, political news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *