పవన్ వ్యాఖ్యలపై కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీల కౌంటర్

TDP Katragaddababu news

టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఎప్పుడు ఏం చెప్పాలన్నా ఫ్లెక్సీల ద్వారానే చెప్తాడు. ప్రతిపక్ష పార్టీల వైఖరిపై ఆయన మాటలతో కాకుండా ఫ్లెక్సీలు పెట్టి మరీ విమర్శిస్తాడు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ మాట్లాడిన మాటలకు హర్ట్ అయ్యిన బాబు పవన్ వ్యాఖ్యలపై ఫ్లెక్సీ వేదికగా స్పందించారు.
ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీల మధ్య మాటల యుద్ధం కాస్తా ఫ్లెక్సీల యుద్ధంగా మారింది. విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీలు వేయించారు. ఆ ఫ్లెక్సీల్లో ఉన్న మేటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ మాటలతో చెప్తే కాట్రగడ్డ బాబు మాత్రం ఫ్లెక్సీలు కట్టి మరీ జనాలకు అర్ధం అయ్యేలా చెప్తున్నారు. పవన్ కు తన ఫ్లెక్సీలతో రివర్స్ కౌంటర్ వేస్తున్నారు.
‘పవన్ కళ్యాణ్ గారూ.. నేను కూయందే తెల్లవారదనుకుందట ఓ అమాయకపు కోడి.. అలా ఉంది మీరన్నమాట. మీరు మద్దతు ఇవ్వకపోతే చంద్రబాబు 2014లోనే రిటైర్ అయ్యేవారా?.. ఎందుకీ అహంకారపు ప్రగల్భాలు?. మీ అన్నదమ్ములంతా కలిసి 2009లో బరిలోకి దిగితే.. మీకు వచ్చింది కేవలం 18 సీట్లే. ఇప్పుడు తలకిందులుగా తపస్సు చేసినా.. మీరు ఒకటో రెండో సీట్లు గెలిస్తే గొప్ప. అంతకు మించి మీకు సీనూ లేదు.. సినిమా లేదంటూ 5కోట్ల ఆంధ్రుల ఆశీస్సులతో మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారు. ఇది తథ్యం’ అంటూ ఫ్లెక్సీ పెట్టారు. కాట్రగడ్డ బాబుకు ఇలా ఫ్లెక్సీలు పెట్టడం కొత్తేమీ కాదు. దేశంలో లేదా రాష్ట్రంలో ఏదైనా ఘటనలు చోటు చేసుకున్నా, ప్రతిపక్ష పార్టీలను విమర్శించాలన్నా ఆయన ఫ్లెక్సీల వేదికగానే విమర్శించడం ఓ అలవాటు.పవన్ పై బాబు ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

TDP Katragaddababu news , Pavan Latest news , Now the war between the TDP and Jansena parties has become a war of Flexi, Flexi news, AP Latest new

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *