అయ్య‌న్న మాట మార్చేశారు

TDP Latest News

దేశం అంటే అంద‌రికీ ఎంత భ‌క్తో ఇటీవ‌లే నిరూప‌ణ‌కు వ‌చ్చింది
దేశం అంటే దేశంలో రాజ్య‌మేలుతున్న వ్య‌వ‌స్థ‌ల‌ను కాపాడుకోవాంటే ఎంత నిబ‌ద్ధ‌త‌తో ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది
కాంగ్రెస్ టీడీపీ మైత్రి దరిమిలా పాత వైరాలు పోయి కొత్త బంధాలు నెల‌కొంటున్న వేళ మంత్రులంతా అధినేత‌కు జేజేలు కొడుతున్నారు
ఈ స్నేహం మంచిదే అని చెబుతున్నారు.. వ్య‌వ‌స్థ‌ల‌ను కాపాడేందుకే తామీ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని అచ్చం చంద్ర‌బాబులానే మాట్లాడుతున్నారు

కాంగ్రెస్ టీడీపీ పొత్తు నేప‌థ్యంలో అనేకానేక వ్యాఖ్యానాలు విన‌వ‌స్తున్నాయి.తాజాగా మంత్రులు అయ్య‌న్న పాత్రుడు, దేవినేని ఉమ, య‌న‌మ‌ల స్పందించారు. పొత్తు ఉంటే తాను వ్య‌తిరేకిస్తాన‌ని, అది పార్టీ సిద్ధాంతాల‌కే విఘాతం అని మొద‌ట్లో స్పందించిన అయ్య‌న్న పాత్రుడు ఇప్పుడు గొం తు మార్చారు.విజ‌య‌న‌గ‌రం జిల్లా జామి మండ‌ల కేంద్రంగా ఆయ‌న పొత్తుకు ఉన్న ఆవ‌శ్య‌క‌తను వివరించారు. చంద్ర‌బాబు మాదిరిగానే దేశాన్ని కాపాడుకోవాల‌న్న ఏకైక ధ్యేయంతోనే తాము కాంగ్రెస్ తో చేతులు క‌లిపామ‌ని చెప్పుకువ‌చ్చారు.నాడు చంద్ర‌బాబు నిర్ణ‌యంపై అంతెత్తు లేచిన సీనియ‌ర్ లీడ‌ర్ అయ్య‌న్న ఇప్పుడిలా గొంతు స‌వ‌రించుకోవ‌డం పై ఆస‌క్తిదాయ‌క చ‌ర్చ ఒక‌టి రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తోంది.ఆయ‌న‌తో పాటు సీమ‌కు చెందిన నేత‌, డిప్యూటీ సీఎం కేఈ కూడా ఆ రోజు చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించారు. ఇప్పుడాయ‌న స్పందించ‌నైనా స్పందించ‌లేదు.

TDP Latest News ,Congress Latest News, Telugu news, Devineni Uma Latest News, Yanamala News, Vijayanagaram District News, Telugu Latest News, Update News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *