చంద్రబాబు కుమారస్వామితో భేటీ అందుకేనా

TDP Latest news

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల నేపధ్యంలో సీఎం కుమారస్వామికి, మాజీ ప్రధాని దేవేగౌడ‌కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం నాడు ఫోన్ చేశారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ -జేడీఎస్ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం పట్ల బాబు అభినందించారు. కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ -జేడీఎస్ కూటమి భారీ విజయం సాధించడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కర్ణాటక సీఎం కుమారస్వామికి ఫోన్ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీని చావుదెబ్బతీసినందుకు ఆయన అభినందల్లో ముంచెత్తారు.
ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఫలితాలు వచ్చాయి ఈ ఫలితాల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకత వ్యక్తమైందని బాబు ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రకటించారు.
నవంబర్ 9 తేదీన బెంగుళూరులో కర్ణాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవేగౌడతో సమావేశం కానున్నారు. జాతీయస్థాయిలో బీజేపీయేతర పార్టీల ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చించనున్నారు. పలు పార్టీల జాతీయ నేతలతో కూడ చంద్రబాబునాయుడు వరుసభేటీలు నిర్వహించాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.

TDP Latest news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *