పోటీ నుండి తప్పుకున్న టీటీడీపీ అధ్యక్షుడు రమణ

tdp leader ramana latest news

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కానీ ఇంకా కూటమి సీట్ల లెక్కలు తేలటం లేదు. ఒకపక్క టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే మరో పక్క కూటమి మాత్రం ఇంకా తర్జన భర్జనలోనే ఉంది . అలకలు బుజ్జగింపు పర్వాలు పూర్తి చేసి ప్రచారం లోకి వెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్, టీడీపీ పొత్తుల విషయంలో సీట్ల సర్దుబాటు లో కూడా క్లారిటీ వచ్చింది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పరిపాలనా బాధ్యతలలో బిజీగా ఉండటంతో  తెలంగాణలో ఆ పార్టీ బాధ్యతలను టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణకు అప్పగించారు. ఇప్పుడు తెలంగాణా ఎన్నికల వేళ మహాకూటమిలో సీట్ల సర్దుబాటు సహా పార్టీ గెలుపు కొరకు అన్ని భాద్యతలను రమణ తన భుజస్కందాలపై మోస్తున్నారు.  ఇప్పుడు కూడా పార్టీ గెలుపు కోసం రమణ పని చెయ్యాలని సూచించిన బాబు రమణ పోటీ చేసే స్థానం కాంగ్రెస్ కు గెలిచే అవకాశం వుండటంతో త్యాగం చెయ్యమని చెప్పారు. అలాగే కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి రమణకు రాజకీయ గురువు కావటంతో రమణ కూడా  పోటీ నుండి వైదొలిగారు. మహా కూటమి గెలిస్తే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటామనే హామీ మేరకే రమణ ప్రస్తుతం పోటీ నుండి తప్పుకున్నారు.

రాష్ట్రంలో మహాకూటమిని ఏర్పాటుచేయడంలో కీలకపాత్ర పోషించిన రమణ  జగిత్యాల కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డికి అండగా ఉండబోతున్నారు..1994లో తొలిసారిగా జగిత్యాల నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగి గెలిచిన రమణ మంత్రిగా పనిచేశారు. అక్కడి నుంచి ఐదుసార్లు పోటీ చేసినా కేవలం రెండు సార్లు మాత్రమే శాసన సభలో కి అడుగు పెట్టారు. అయితే పొత్తు ధర్మం ప్రకారం గెలిచేవారికే సీటు ఇవ్వనుండటం వల్ల అలాగే తన గురువైన జీవన్ రెడ్డి పై ఉన్న గౌరవ భావం  వల్ల పోటీ నుంచి రమణ తప్పుకున్నట్టు తెలుస్తుంది.

tdp leader ramana latest news,telangana tdp leader ramana not contesting as mla in elections,telangana tdp leader ramana latest news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *