టీడీపీ నేతలు ఇప్పుడు చేయల్సిన పని ఇదేనట

TDP Leaders
గత ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని చేపట్టింది తెలుగుదేశం పార్టీ. ఇదే ఫలితాన్ని మరోసారి రిపీట్ చేయాలని భావిస్తోంది. అందుకోసం ఆ పార్టీ అధిష్ఠానం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకవైపు తెలంగాణ ఎన్నికలను ఓ కంట కనిపెడుతూనే, ఏపీలో పాలన కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వీటితో పాటు జాతీయ రాజకీయాలపైనా దృష్టి సారించారు. గత ఎన్నికల్లో కలిసి పని చేసిన భారతీయ జనతా పార్టీ.. విభజన చట్టంలోని అంశాల అమలు విషయంలో మోసం చేసిందనే కారణంతో ఆ పార్టీతో స్నేహబంధానికి పుల్‌స్టాప్ పెట్టేసింది తెలుగుదేశం పార్టీ. ఈ కారణంతోనే ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన ఆ పార్టీ.. అప్పటి నుంచి పోరాటాన్ని కొనసాగిస్తోంది. అదే సమయంలో ఇటు రాష్ట్రంలోనూ బీజేపీ చేసిన మోసాన్ని ఏపీ ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యారు టీడీపీ నేతలు. అంతేకాదు, పార్లమెంట్ సమావేశాల్లో రెండు సార్లు అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశ పెట్టారు టీడీపీ ఎంపీలు. దీనికి మద్దతు కూడగట్టే క్రమంలోనే తెలుగుదేశం పార్టీ తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి దగ్గరయింది. తర్వాత తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఏకంగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడేమో జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ఈ రెండు పార్టీలు కలిసి నడవనున్నాయి. ఈ మేరకు చంద్రబాబు.. ఇటీవల రాహుల్‌ గాంధీని కూడా కలిశారు.
వీరిద్దరి భేటీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో సంచలనం అయింది. ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా దీని గురించే చర్చించుకోవడం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రెండు పార్టీల మధ్య బంధం తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన పార్టీలకు ఆయుధంగా మారింది. దీన్ని ఆధారంగా చేసుకునే ఆ పార్టీలు టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ప్రతిపక్షాలు దీనిని రాద్దాంతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ముందే తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు వర్కౌట్ ప్రారంభించారని సమాచారం. ఇందులో భాగంగానే టీడీపీ నేతలకు టార్గెట్ సెట్ చేశారని తెలుస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నందున కాంగ్రెస్‌తో పొత్తు టీడీపీకి మైనస్‌ కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగంగానే ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొడుతూనే… ప్రజలకు మొత్తం పరిణామాలను వివరించి చెప్పాలని చంద్రబాబు నిర్ణయించినట్లు వినికిడి. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో జనంలోకి తీసుకెళ్లాలని తీర్మానించింది. ప్రజల్లోకి వెళ్లిన నేతలు ‘‘బీజేపీ హోదా ఇవ్వనంటోంది. హామీలు నెరవేర్చనంటోంది. అదే సమయంలో… తాము అధికారంలోకి వచ్చిన తక్షణం ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్‌ స్పష్టంగా ప్రకటించారు. అన్నింటికీ మించి… మోదీని ఓడించడం రాజకీయ, ప్రజాస్వామ్య అవసరం! అప్పుడు కాంగ్రెస్‌… ఇప్పుడు బీజేపీ! పార్టీ ఏదైనప్పటికీ… తెలుగు వారికి అన్యాయం చేసిన వారిపై పోరుకు టీడీపీ సిద్ధంగా ఉండాలి’’ అని వివరించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇలా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని కూడా నేతలను హెచ్చరించారని టాక్.

TDP Leaders , AP TDP leaders , AP Political news, telugu news, telugu update news, TDP Party news, TDP leaders latest news,

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *