వైసీపీ ని దెబ్బ తీసే ప్లాన్ లో టీడీపీ

tdp party latest new

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ అధికార టీడీపీ..ప్ర‌తిప‌క్ష వైసీపీకి తాజాగా గ‌ట్టి దెబ్బే కొట్ట‌నుంద‌ని స‌మాచారం. అసలు మ్యాట‌ర్ ఏంటంటే.. ఎల‌క్ట్రానిక్ మీడియా స్ట్రీమ్‌లో త‌న హ‌వా కొన‌సాగిస్తున్న టీడీపీకి.. సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా ప‌ట్టు లేదు. మ‌రోవైపు వైసీపీకి ఎల‌క్ట్రానిక్ మీడియా స్ట్రీమ్‌ల‌లో ప‌ట్టు లేక‌పోగా.. సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న‌దైన ప్ర‌చారంతో దూసుకుపోతుంది. ఎంత‌లా అంటే టీడీపీ శ్రేణుల‌కి ఊపిరి ఆడ‌కుండా చేస్తుంది సోష‌ల్ మీడియా. దీంతో సోష‌ల్ మీడియా పై చంద్ర‌బాబు స‌ర్కార్ ఉక్కుపాదం మోప‌నుంద‌ని స‌మాచారం.

సోష‌ల్ మీడియ‌లో వైసీపీ ప్ర‌చారం పీక్స్‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబుతో స‌హా తెలుగు త‌మ్ముళ్ళు ఏదైనా చిన్న‌మిస్టేక్ చేయ‌గానే.. వారిని ఆడేసుకుంటుంది సోష‌ల్ మీడియా. ప్ర‌స్తుతం టీడీపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు.. గ‌తంలో వారు చేసిన వ్యాఖ్య‌ల‌ను లింక్ చేసి మరి టీడీపీ నేత‌ల‌కు చుక్కలు చూపిస్తుంది సోష‌ల్ మీడియా. దీంతో టీడీపీ వ్యూహాత్మంగా వైసీపీ ఆయువుప‌ట్టు పై దెబ్బ‌కొట్ట‌డానికి ప్లాన్ వేసింది. ఈ క్ర‌మంలో ప‌లువుడు సోష‌ల్ మీడియా ప్ర‌మోట‌ర్ల పై కేసులు న‌మోదు చేసి అరెస్టులు చేసేందుకు టీడీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని స‌మాచారం. ఇక ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్లుల‌ను కేసులంటూ ఇబ్బంది పెట్టిన టీడీపీ మ‌రోసారి అదే ఫార్ములాను వాడి వైసీపీని దెబ్బ తీయాల‌ని భావిస్తుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాకుండా సోష‌ల్ మీడియాలో కూడా ఓ టాక్ స్ప్రెడ్ అవుతోంది. మ‌రి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఈ వ్య‌వ‌హారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

tdp party latest new,tdp party planned to defeat ysrcp party,ap cm chandrababu naidu planned to defeat the ys jagan mohan reddy in next elections

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *