అవినీతిలో పోటీ పడుతున్న మన చంద్రులు..

అభివృద్ధి లో టాప్ అనుకుంటే అవినీతి లో టాప్ గా నిలిచామా ?
అవినీతి పై సర్వే లో తెలుగు రాష్ట్రాల పరిస్థితి
టాప్ 5 లో ఉన్న తెలుగు రాష్ట్రాలు
అవినీతిలో తెలంగాణ రెండో స్థానం
ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానం

అవినీతి నీవెక్కడ అంటే ఇంకెక్కడా మీ రాష్ట్రం లోనే అని సమాధానం చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాలు అవినీతి, అక్రమాల్లో ముందు వరుస లో నిలిచాయి. పోటీ పడి మరీ టాప్ 5 లో స్థానం దక్కించుకున్నాయి. . అవినీతిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి బాట లో నడుస్తుందని చెప్పుకుంటున్న అధికార పార్టీ అవినీతి లో కూడా ముందు వుంది అన్న విషయం పై ఏమంటుందో? పక్క తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనూ అక్రమాలు జోరుగానే సాగుతున్నాయి అవినీతి కి కొదవ లేదు అనే విషయాన్ని , ఏపీ అవినీతిలో నాల్గవ స్థానంలో నిలిచి మరీ నిరూపించుకుంది. అవినీతిపై సీఎంఎస్ -ఇండియా తాజాగా జరిపిన అధ్యయనంలో మన తెలుగు రాష్ట్రాల అవినీతి భాగోతం బట్టబయలయింది.

దేశంలోని 13 రాష్ట్రాల్లో 11 పౌర సేవలపై జరిపిన అధ్యయనంలో ఈ అవినీతి చిట్టా బయటపడింది. . అభివృద్ధి మంత్రం జపిస్తున్న మన తెలుగు రాష్ట్రాల అవినీతి గుట్టు రట్టయింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, బీహార్, మధ్యప్రదేశ్, యూపీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో న్నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. . ల్యాండ్ రికార్డులు, ప్రజాపంపిణీ వ్యవస్థ, ఆసుపత్రులు, విద్యుత్, స్కూళ్లు, నీటిసరఫరా, బ్యాంకింగ్ సర్వీసులు, పోలీసు, న్యాయ, గృహనిర్మాణం, రవాణ శాఖల్లో అవినీతి సాగుతుందని సీఎంఎస్ సర్వే తేల్చిచెప్పింది. అవినీతి రాష్ట్రాల్లో తమిళనాడు అగ్రస్థానంలో ఉందని సీఎంఎస్ ఇండియా సర్వే లో వెల్లడయ్యింది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పౌర సేవలు పొందాలంటే లంచం ఇవ్వాల్సిందేనని 73 శాతం మంది చెప్పారు. అవినీతి అధికారుల తీరు పై అసహనం వ్యక్తం చేసారు. ప్రభుత్వ యంత్రాంగ అవినీతి తో అభివృద్ధి కుంటుపడుతుందని చాలా మంది చెప్పినట్టు సర్వే గణాంకాలు చెపుతున్నాయి. రవాణ, పోలీసు, గృహనిర్మాణం, ల్యాండ్ రికార్డులు, వైద్యఆరోగ్యశాఖల్లో అక్రమాలు ఎక్కువగా సాగుతున్నాయని సర్వే వెల్లడించింది. ఆధార్ కార్డు, ఓటరు కార్డు పొందాలన్నా లంచమివ్వాల్సి వస్తుందని 7 శాతం మంది ప్రజలు చెప్పడం విశేషం. కొత్తగా డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలన్నా, రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసినా, పాఠశాలలో పిల్లల ప్రవేశాలకోసం లంచాలు ఇవ్వక తప్పడం లేదని ప్రజలు చెప్పారు. లంచావతారాలు అడుగడుగునా ఉన్న మన తెలుగు రాష్ట్రాలు టాప్ 5 లో ఉండటం ఆశ్చర్యమేమీ కాదు. ఈ ఘనత సాదించిన ప్రభుత్వాలు ఇకనైనా అవినీతి రహిత రాష్ట్రాలు గా తెలుగు రాష్ట్రాలను మార్చటానికి ప్రయత్నించాలి.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *