తెలంగాణా బీజేపీ రెండో జాబితా రగడ

Telangana BJP

తెలంగాణలో పోటీ చేయబోయే తమ అభ్యర్థుల రెండో విడతా జాబితాను బీజేపీ ప్రకటించింది. ఇందులో 28 మందికి చోటు కల్పించింది. నిజామాబాద్ అర్బన్ నుంచి మాజీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ, రాజేంద్రనగర్ నుంచి బద్ధం బాల్‌రెడ్డి, మలక్ పేట్ నుంచి ఆలె జితేంద్ర, వరంగల్ పశ్చిమ నుంచి మాజీ ఎమ్మెల్యే ధర్మారావులకు చోటు దక్కింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా నుంచి సినీ నటి రేష్మా రాథోడ్‌కు బీజేపీ అవకాశం కల్పించింది. రెండు విడతల్లో 66 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ ఇంకా 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
బిజెపి ప్రకటించిన రెండో విడతా జాబితాలో 28 మందికి అవకాశం లభించింది. సిర్పూర్ స్థానం నుంచి శ్రీనివాసులు, ఆసిఫాబాద్ సీటు అజ్మిర ఆత్మారామ్ నాయక్ కి, ఖానాపూర్ స్థానానికి ఎస్. అశోక్ పేర్లను ప్రకటించారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి సువర్ణరెడ్డి, నిజమాబాద్ అర్బన్ నుంచి లక్ష్మీనారాయణ, జగిత్యాల నుంచి ఎం.రవీందర్ రెడ్డిని బీజేపీ బరిలోకి దింపుతోంది. రామగుండం నుంచి బాలమూరి వనిత, సిరిసిల్లా స్థానానికి మల్లగారి నర్సగౌడ్, సిద్దిపేటలో నాయిని నరోత్తమ్ రెడ్డిని, కుకట్ పల్లి నుంచి ఎం.కాంతారావుని బీజేపీ బరిలోకి దింపుతోంది. రాజేంద్రనగర్ స్థానాన్ని బద్దం బాల్ రెడ్డికి, శేరిలింగంపల్లి సీటును జి.యోగానంద్ కి, మలక్ పేట్ స్థానం ఆలే జితేంద్ర, చార్మినార్ నుంచి ఉమా మహేంద్ర, యాకత్ పుర నుంచి రూప్ రాజ్ బహదూర్ పూర నుంచి హనీఫ్ అలీల పోటీలో నిలుపుతున్నట్టు ప్రకటించింది. రెండో జాబితా విడుదలైన కాసేపటికే బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయి. సెకండ్ లిస్ట్ లోనూ అవకాశం దక్కని నాయకులు పార్టీ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. టికెట్లు అమ్ముకుంటున్నారంటూ అధిష్టానంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అభ్యర్థుల దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన తెలిపారు.
హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద సీట్లు దక్కని బిజెపి నాయకులు ఆందోళనకు దిగారు. శేరిలింగంపల్లి టికెట్టు యోగానంద్ కు కేటాయించడంతో ఆశావాహులు నరేష్, భాస్కర్ రెడ్డి మద్దతు దారులు ఆందోళన చేపట్టారు. బీజేపీ కార్యాలయం పైకెక్కి.. టికెట్లు అమ్ముకుంటున్నారంటూ నినాదాలు చేశారు. కార్యాలయం పైకి ఎక్కిన వారిని సిబ్బంది కిందకు దించారు.. శేరిలింగంపల్లి అభ్యర్థి యోగానంద్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అటు, నిజామాబాద్ అర్బన్ లో బీజేపీలో అసమ్మతి భగ్గుమంది. అర్బన్ అభ్యర్తిగా యెండల లక్ష్మీనారాయణను ప్రకటించడంతో…. ధన్ పాల్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో బీజేపీ కార్యాలయంపై దాడి చేసి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. బీజేపీకి రాజీనామా చేసే యోచనలో ధన్ పాల్ ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana BJP, Telangana BJP Second list, Telangana political News, Second list of BJP, latest News on Political News, telugu News, BJP Party latest News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *