కేసీఆర్ గవర్నర్ తో భేటీ అందుకేనా

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. యాభై రోజుల్లో వంద సభలు అని ప్రకటించారు కానీ… ఇప్పుడు సైలెంటయిపోయారు. దీపావళి వెళ్లిపోయిన తర్వాత.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. సభల గురించి ఆలోచిద్దామని ఫిక్స్ అయిపోయారు. అయితే ఫామ్‌హౌస్‌ లేకపోతే.. ప్రగతి భవన్‌లోనే.. రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. మారుతున్న రాజకీయంతో.. ఆయన తన ఆలోచనలకు మరింత పదును పెడుతున్నారు. బయట సభలంటూ తిరిగితే… తెర వెనుక వ్యూహాలు ఖరారు చేసుకోవడం కష్టం కాబట్టి.. మొత్తం ప్రచార బాధ్యతలు కొడుకు కేటీఆర్ కు అప్పగించి… రాజకీయ సమీకరణాల లెక్కలు తీస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఓట్లు చీలితే.. ఎలాంటి పరిస్తితులు ఉంటాయో… అంచనాలు వేసుకుని దాని ప్రకారం… ప్లాన్ బీని రెడీ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన హఠాత్తుగా.. రాజ్ భవన్‌కు వెళ్లారు. రెండు గంటల పాటు గవర్నర్ నరసింహన్‌తో చర్చలు జరిపారు.

కేసీఆర్ గవర్నర్ ను కలవడం… అనేది చాలా సాధారణమైన విషయం . అయితే అది అసెంబ్లీని రద్దు చేయక ముందే. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత.. గవర్నర్‌తో.. కేసీఆర్‌ భేటీ అవ్వాల్సినంత అవసరం ఉండదు. పైగా.. మంత్రులకు… ఎమ్మెల్యేలకే కాదు.. ఎవరినీ కలవని.. కేసీఆర్ .. రెండు గంటలు గవర్నర్‌తో మాట్లాడారంటే.. కచ్చితంగా రాజకీయమేనని… ఇతర పార్టీల నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే.. కేంద్రానికి.. కేసీఆర్‌కు అనుసంధాన కర్తగా గవర్నర్‌ వ్యవహరిస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే.. ముందస్తు ఎన్నికల గురించి అసలు ఏ మాత్రం బయటకు పొక్కకుండా.. పని పూర్తి చేయడంలో.. గవర్నర్ వందకు నూటొక్క శాతం సహకరించారు. ఇక.. గవర్నర్ చేసే రాజకీయంపై చంద్రబాబు చేసే విమర్శలు సరే సరి. ఓ రకంగా.. బీజేపీ తరపున… గవర్నరే అన్ని పనులు చక్క బెడుతూంటారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తూంటారు. కాదనడానికి.. ప్రత్యేకంగా కారణాలు కూడా ఏమీ ఉండవు.

ఇప్పుడు రెండు గంటల పాటు… గవర్నర్ తో ఏ అంశంపై చర్చించారన్నది.. పూర్తిగా క్లారిటీలేదు. కానీ.. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో.. ఎన్నికల తర్వాత.. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటేనే.. ఏదో ఒకటి చేయగరు. ఆ విషయం బాగా కేసీఆర్‌కు తెలుసు. పూర్తి మెజార్టీ రాకపోయినా.. ఓ వైపు ఎంఐఎం.. మరో వైపు మూడు, నాలుగు సీట్లు అయినా తెచ్చుకుని బీజేపీ రెడీగా ఉంటాయి కాబట్టి… కేంద్రం మద్దతు ఉంటే… కంటిన్యూ కావొచ్చని కేసీఆర్‌కు బాగా తెలుసు. ఈ విషయంలోనే ఎందుకైనా మంచిదని.. ఆయన గవర్నర్ ను కలిసినట్లు చెబుతున్నారు. ఏది నిజమో.. త్వరలో బయటకు రానుంది..!

telangana cm kcr latest news,telangana cm kcr met governor narasimhan,governor narasimhan latest news,governor narasimhan met telangana cm kcr

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *