గజ్వేల్ అభ్యర్థిగా కేసీఆర్ నామినేషన్·

·  తొలుత కోయినాపల్లి వెంకన్న ఆలయంలో పూజలు

·  మధ్యాహ్నం 2.34 గంటలకు నామినేషన్ పత్రాల సమర్పణ

·  సిద్ధిపేటలో నామినేషన్ దాఖలు చేసిన హరీశ్

గజ్వేల్ శాసనసభా నియోజకవర్గ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 2.34 గంటలకు గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కేసీఆర్ వెంట హరీశ్ రావు, మరో ముగ్గురు నేతలు మాత్రమే ఉన్నారు. అంతకుముందు తన ఇష్టదైవం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నేరుగా అక్కడ నుంచి గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు. హరీశ్‌రావు కూడా కేసీఆర్ తోపాటు కోయినాపల్లి ఆలయలో పూజలు చేశారు. మందుగా హైదరాబాద్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆశీర్వచనాలు తీసుకున్న హరీశ్.. తర్వాత కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం  కోనాయిపల్లిలో పూజలు చేయించిన బీ ఫారం తీసుకొని నేరుగా సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుండి గద్దెబొమ్మ సమీపంలోని పెద్ద మసీద్‌లోకి వెళ్లి ప్రార్థనలు నిర్వహించి ముస్లీం పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ తర్వాత నేరుగా చర్చికి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొని అక్కడ క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. కోనాయిపల్లి గ్రామ ప్రజలను ఉద్దేశించి కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ కష్టాలు పోయాయనిరైతులకు సరిపోయినంతగా కరెంట్‌ ఇస్తున్నామన్నారు. వెంకన్న దయవల్ల వచ్చే ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందనిఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వామివారి పాదాలు కడుగుతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్దికాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. తాను ఎంత ఉన్నతస్థాయికి వెళ్లినా.. తన మూలాలు ఇక్కడే ఉంటాయన్నారు. స్థానిక తెరాస అభ్యర్థి హరీశ్‌రావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కేసీఆర్‌ కోరారు.

telangana cm kcr news,telangana cm kcr filed nomination today,cm kcr filed nomination at gajwel rto office,telangana cm kcr latest news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *