కేసిఆర్ కి బిజినెస్ రిఫార్మర్ అవార్డు – అందుకున్న మంత్రి కేటీఆర్

telangana cm kcr news
ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కి ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రి ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ముంబైలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం లో అందుకున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలు అనేక వినూత్న విధానాలతో ముందుకు వెళ్లేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మార్గదర్శనం చేశారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వినూత్నమైన సింగిల్విండో అనుమతుల ప్రక్రియ తో పాటు పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులు ఇచ్చేటువంటి విప్లవాత్మకమైన సంస్కరణలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారన్నారు. పదిహేను రోజుల తర్వాత ప్రభుత్వం అనుమతులు అందించకుంటే నేరుగా పరిశ్రమలను ప్రారంభించుకునే ఎటువంటి అవకాశం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదని, పరిశ్రమల అనుమతుల దరఖాస్తులను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసే అధికారులకు జరిమానాలు విధించేలా తమ ప్రభుత్వం చట్టం చేసిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
ఇంతటి విప్లవాత్మకమైన పరిశ్రమల అనుమతుల ప్రక్రియ దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని మంత్రి కేటీ రామారావు తెలిపారు. పరిశ్రమలు మరియు పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని కల్పించడం లో తీసుకోవాల్సిన చర్యలు విధానపరమైన నిర్ణయాల విషయంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశానికి ఆదర్శనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. మేకిన్ ఇండియా తోపాటు మేక్ ఇన్ తెలంగాణ అనేది మా విధానం అన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ లో పరిశ్రమల ఏర్పాటుకు అందరినీ ఆహ్వానించారు. ప్రతిష్టాత్మకమైన బిజినెస్ రిఫార్మ్ మేర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించిన ఎకనమిక్ టైమ్స్ సంస్థకు ముఖ్యమంత్రి గారి తరపున ధన్యవాదాలు తెలియజేశారు.
ముంబైలో జరిగిన ఈ సమావేశానికి హాజరైన పలువురు పారిశ్రామికవేత్తల ను కలిసిన మంత్రి కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని మంత్రి వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకు రావాలని సమావేశానికి హాజరైన వివిధ పారిశ్రామిక వేత్తలకి తెలియజేశారు.

telangana cm kcr news,business reformer award for cm kcr,ktr took business reformer award,telangana cm kcr latest news,cm kcr update news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *