కేసీఆర్ కాన్వాయ్ కార్లకు వందల చలాన్లు ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కు సంఖ్యాశాస్త్రంపై విపరీతమైన నమ్మకం. ఆయనకు ఆరు అచ్చి వచ్చింది కాబట్టి.. దాని మీదనే ఏదైనా చేస్తారు. తన కాన్వాయ్ కార్లకూ అదే పెట్టించుకున్నారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. ఇటీవలి కాలంలో.. ట్రాఫిక్ పోలీసులు… ప్రగతి భవన్‌కు పదుల సంఖ్యలో చలాన్ రసీదులు తెచ్చి ఇస్తున్నారు. అక్కడున్న వారికి ఏమీ అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌కి … చలాన్లు ఎలా వేస్తారనేది చాలా మందికి అర్థం కాని విషయం. పోలీసులకు కూడా అర్థం కాలేదు. చివరికి.. సీసీ టీవీ పుటేజీలు చూసి అసలు విషయం తెలుసుకున్నారు.

హైదరాబాద్ లో వాహనదారులు ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాహన నెంబర్లను వారి సొంత వాహనాలకు వాడుతున్నారు. నిభందనలు ఉల్లంగించిన వారికి చలాన్లు జారీ చేసే సమయంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనాలకు చలాన్లు వెళ్లడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హైటెక్ అయ్యారు. హెల్మెట్ లేకపోయినా… చలాన్ ఇంటికి పంపుతున్నారు. దీంతో క౧ంత మంది ట్రాఫిక్ పోలీసుల వేదింపుల నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. కొంత మంది నెంబరు ప్లేట్ లను తీసి వేయగా, మరికొంత మంది నెంబర్ చివరన ఉన్న ఒక నెంబర్ ను తీసివేస్తున్నారు. మరి కొంత మంది మాత్రం ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహన శ్రేణి నెంబర్లను వారి వాహనాలకు పెట్టుకోని ఇష్టా రాజ్యంగా తిరుగుతున్నారు. ఇలా నగరంలో TS09K9999 అనే నెంబర్ పై అనేక రకాల వాహనాలు తిరుగుతున్నట్లు చలాన్ల ద్వారా గుర్తించారు.

ఈ వాహనాలను ఎవరు వాడుతున్నారు..? వాటి అసలు నెంబర్లు ఏమిటి..? యజమానులు ఎవరు..? అన్న వివరాలు ఆరా తీస్తున్నారు. ఆ వాహనాల్లో ఏమైనా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా….? అన్న అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. నిత్యం రద్దీ ప్రదేశాల్లో తిరగడం, సీసీ కెమెరాలను పట్టించుకోకపోవడం, అధిక స్పీడ్ తో వెళ్లడం వంటి వాటిని కంమాండ్ ఆండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది గుర్తించారు. ఒకవేళ సంఘవిద్రోహశక్తులు ఈ నెంబర్లను వాడితే జరిగే అనర్ధాలను ఉహించలేమని కొందరు అధికారులు తెబుతున్నారు. ఇంత చేసినా.. అసలు ఈ కార్లు ఎవరు వాడుతున్నారన్నదాన్ని మాత్రం.. పోలీసులు ఇంకా గుర్తించలేకపోయారు.

telangana cm kcr updates,hyderabad traffic police gave challans to kcr convoy,large number of challans on kcr convoy,telangana cm kcr latest news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *