కోర్టుకు హాజరైన తెలంగాణా డీజీపీ

Telangana DGP attend to the court

టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ కేసులో కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ డిజిపి హైకోర్టుకు హాజరయ్యారు. రేవంత్ విషయంలో ఏ ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారని ప్రశ్నించిన కోర్టు ఈసీ కి అటు తెలంగాణా పోలీసులకు చీవాట్లు పెట్టారు. ఇది సరైన పద్ధతి కాదని ప్రచారం చేసుకునే అభ్యర్థిని బలవంతంగా అరెస్ట్ చెయ్యటం కరెక్ట్ కాదన్న కోర్టు వెనత్నే రేవంత్ ను విడుదల చెయ్యాలని ఆదేశించారు. దీంతో రేవంత్ ను పోలీసులు విడిచి పెట్టారు. ఇక ఈ వ్యవహారం లో అత్యుత్సాహం ప్రదశించిన వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ పై వేటు వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. హై కోర్టు ఈసీ తీరుపై కూడా తీవ్ర అభ్యంతరాన్ని, అసహనాన్ని వ్యక్తం చేసింది.

Buy the Latest smart Phone Cheaper Price 

ఇక రేవంత్ అరెస్ట్ వ్యవహారంలో పోలీస్ శాఖ పని చేసిన తీరును తప్పు పట్టిన హై కోర్టు డీజీపీ తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో డీజీపీ మహేందర్ రెడ్డి కోర్టుకు వెళ్ళారు. అర్థరాత్రి రేవంత్ ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్న దానికి కోర్టుకు ఆయన వివరణ ఇవ్వనున్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. అయితే రేవంత్ అరెస్ట్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు కూడా పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2.30కి డీజీపీని హైకోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల నేపథ్యంలో డిజిపి మహేందర్ రెడ్డి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ అరెస్ట్ పై ఆయన కోర్టు కు ఏం వివరణ ఇస్తారు…కోర్టు ఎలా స్పందిస్తుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

 

Telangana DGP attend to the court , Telangana Latest news , Revanth reddy latest news , High Coourt, DGP Mahender reddy , Telugu news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *