కేసీఆర్ సర్కార్ పై తెలంగాణా ఐఏఎస్ ల పోరుబాట

Telangana IAS officers

తెలంగాణ ప్రభుత్వంపై పోరుబాట పట్టారు ఐఏఎస్ అధికారులు. కేసీఆర్ సర్కార్ తమపై వివక్ష చూపిస్తుందంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన అధికారులు ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేనంత విద్వేషపూరిత వివక్ష ఇక్కడ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల్ని ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. అప్రాధాన్య పోస్టుల్లోనే తమను నియమిస్తుందని మండిపడ్డారు అధికారులు. తమ బాధాల్ని తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘం తమను పట్టించుకోవడం లేదనే కారణంతో విడిపోయి ‘తెలంగాణ స్థానిక ఐఏఎస్‌ అధికారుల సంఘాన్ని’ ఏర్పాటు చేసుకున్నారు.
సోమవారం రాత్రి బేగంపేట ఐఏస్ అధికారుల సంఘ భవనంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. 20 మందికి పైగా ఐఏఎస్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. బలహీన వర్గాలకు చెందిన తెలంగాణ లోకల్‌ ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం అప్రాధాన్య పోస్టుల్లో నియమించిందని ఆరోపించారు. ఆంధ్రా సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్‌లకు మంచి పోస్టులు ఇస్తూ ప్రభుత్వం తమను అవమానిస్తోందన్నారు. తమకు కేటాయించాల్సిన పోస్టుల్లో నాన్‌ ఐఏఎస్‌లు, విశ్రాంత అధికారులను కమిషనర్లు, ఎండీల వంటి పోస్టుల్లో నియమించారని వాపోయారు. ఇప్పటికే ఈ విషయంపై సీఎస్‌కు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. ఆరుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఐఏఎస్‌ అధికారులను సచివాలయంలో గుమస్తాలాంటి పోస్టుల్లో నియమించారన్నారు. ఎస్టీ మహిళా ఐఏఎస్‌ భారతీనాయక్‌ గత నాలుగేళ్లుగా సచివాలయంలోనే ఇలా పనిచేస్తున్నారు. ఓసీల నుంచి ఐఏఎస్‌ కాని వాళ్లను తీసుకువచ్చి ఇక్కడ ఐఏఎస్‌లకు నిర్దేశించిన పోస్టుల్లో నియమించారని ఆరోపించారు. అత్యున్నత స్థానంలో ఉన్న తెలంగాణ అధికారులకే ఇలాంటి పరిస్థితి ఉండడం వల్ల ఎవరికీ చెప్పుకోలేక మానసిక వేదనకు గురవుతున్నామన్నారు ఐఏఎస్ అధికారులు.

Telangana IAS officers fighting on KCR Sarkar , Telangana IAS officers  Latest News, Telugu News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *