ఎల్ఆర్ఎస్ అంటే త‌మాషా అయ్యిందా?

* గ‌డువు మ‌రో నెల రోజులు పెంపుద‌ల‌
* ఆల‌స్యం చేసేవారినపై జ‌రిమానా!

ఎల్ఆర్ఎస్ అంటే ప్ర‌భుత్వాల‌కు త‌మాషా అయిన‌ట్లుంది. గ‌త నెల‌లో ఏప్రిల్ 30 ఎల్ఆర్ఎస్‌కు చివ‌రి రోజు అని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆలోపు ఎల్ఆర్ఎస్ ఫైళ్ల‌న్నీ పూర్తి చేయాల‌ని ఉంది. కాక‌పోతే, ఆ ప్ర‌క్రియ పూర్తి కాక‌పోవ‌డంతో మ‌ళ్లీ క‌థ మొద‌టికొచ్చింది. ఈసారి మే చివ‌రివ‌ర‌కూ గ‌డువును పొడ‌గిస్తూ పుర‌పాల‌క శాఖ జీవో విడుద‌ల చేసింది. అస‌లు ఎందుకు ఎల్ఆర్ఎస్ ఫైళ్ల‌కు మోక్షం ల‌భించ‌ట్లేదంటే? జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇత‌ర స్థానిక సంస్థ‌లు అధికారులు, సిబ్బంది క‌లిసి మూకుమ్మ‌డిగా అక్ర‌మంగా ఎల్ఆర్ఎస్ ద‌ర‌ఖాస్తుదారుల నుంచి సొమ్ము దండుకుంటున్నారు. వారు అడిగినంత సొమ్ము ఇస్తేనేమో ఎల్ఆర్ఎస్ ఫైళ్ల‌కు మోక్షం క‌ల్పిస్తున్నారు. లేక‌పోతే, అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇలా, అనేక మంది అధికారుల మీద ప్ర‌భుత్వం వ‌ద్దకు బోలెడ‌న్నీ ఫిర్యాదులు అందాయి. ఘ‌ట్‌కేస‌ర్‌లోని ఒక ప్రాంతంలో ఇలాగే హెచ్ఎండీఏ అధికారులు నానా తిప్ప‌లు పెడుతుండ‌టంతో.. ఆ స్థ‌ల య‌జ‌మాని ఏకంగా సీఎం దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకెళ్లారు. పుర‌పాల‌క శాఖ మంత్రికి కూడా లేఖ రాశారు. కేవ‌లం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సిబ్బంది వ‌ల్లే ఇంత ఆల‌స్యం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని మాత్రం ప్ర‌భుత్వం అర్థం చేసుకోవ‌డం లేదు. కొత్త నిర్మాణాల‌కు 21 రోజుల్లో అనుమ‌తినివ్వాల‌ని.. లేక‌పోతే ఆల‌స్య‌మ‌య్యే రోజు చొప్పున జ‌రిమానా విధించాల‌నే నిబంధ‌న ఉన్న విష‌యం తెలిసిందే. అదేవిధంగా, ఎల్ఆర్ఎస్ ఫైళ్ల ప‌రిష్కారంలో ఆల‌స్యం చేసే అధికారులు, సిబ్బంది మీద జ‌రిమానా విధిస్తామ‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాలి. అప్పుడు కానీ, ఎల్ఆర్ఎస్ ఫైళ్ల‌కు మోక్షం లభించ‌ద‌ని చెప్పొచ్చు.

tags: telangana government exends lrs deadline for another one month, telangana municipal department extends lrs till may 31, 2018

ఎల్ఆర్ఎస్ గ‌డువు నెల రోజు పెంపుద‌ల‌
ఎల్ఆర్ఎస్ గ‌డువు మే వ‌ర‌కూ పొడిగింపు
ఎల్ఆర్ఎస్ గ‌డువు మే వ‌ర‌కూ పెంపుద‌ల‌

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *