ఇంటి చ‌రిత్ర తెలుసుకోవం ఇంత ఈజీనా?

తెలంగాణ ప‌ట్ట‌ణ‌వాసుల‌కు, ఇండ్ల కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌. ఇక మీరు ఏ న‌గ‌రం, ప‌ట్ట‌ణంలో అయినా సులువుగా ఇల్లు కొనుక్కోవ‌చ్చు. మీరు కొనాల‌నుకునే ఇంటికి సంబంధించిన సంపూర్ణ వివ‌రాల‌ను కాలు క‌ద‌ప‌కుండానే తెలుసుకోవ‌చ్చు. ఆయా ఇంటి య‌జ‌మాని ఎవ‌రు? అది ఎన్ని అంత‌స్తుల ఇల్లు? ఆస్తి ప‌న్ను క్ర‌మం త‌ప్ప‌కుండా చెల్లిస్తున్నారా? ఎన్‌కంబ‌రెన్స్ స‌ర్టిఫికెట్ వంటి వివ‌రాల‌న్నీ సులువుగా తెలిసిపోతాయి. అంతేకాకుండా, ఆయా ఇంటిపై కోర్టులో కేసులుంటే కూడా ఇట్టే తెలిసిపోతుంది. ఒక్క జీహెచ్ఎంసీ త‌ప్ప‌, మిగ‌తా 72 ప‌ట్ట‌ణాల్లోని ప‌న్నెండున్న‌ర ల‌క్ష‌ల ఇండ్ల య‌జ‌మానుల వివ‌రాల‌ను సీడీఎంఏ డిపార్టుమెంట్ ఆన్‌లైన్‌లో న‌మోదు చేసింది. ఆ వివ‌రాల‌ను చూడాలంటే సింపుల్‌. మీరు సీడీఎంఏ. తెలంగాణ‌. గ‌వ్‌. ఇన్  (http://www.cdma.telangana.gov.in) వెబ్‌సైటులోకి వెళ్లాలి. know property details అని క్లిక్ చేసి.. మీరు కొనాల‌నుకుంటున్న ఇల్లు ఏ జిల్లాలో ఉంది? అది ఏ యూఎల్‌బీ ప‌రిధిలోకి వ‌స్తుంది? ఇంటి నెంబ‌రు ఎంత‌? property ట్యాక్స్ అసెస్‌మెంట్ నెంబ‌ర్ ఎంత‌? వ‌ంటి వివ‌రాల‌ను న‌మోదు చేస్తే ఆయా ఇంటికి సంబంధించిన సంపూర్ణ చ‌రిత్ర వ‌చ్చేస్తుంది. దాదాపు 72 ప‌ట్ట‌ణాల్లో ఖాళీ స్థ‌లాలు, ఆస్తుల‌కు సంబంధించి ఫోటోల‌తో స‌హా వివ‌రాలు ఆన్‌లైన్‌లో న‌మోదు చేశారు. వీటిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్ డిపార్టుమెంట్తో అనుసంధానం చేశారు. ఇలా దాదాపు ప‌ద‌కొండు ల‌క్ష‌ల ఇండ్ల వివ‌రాల‌ను న‌మోదు చేశారు. మొత్తానికి, ఇక నుంచి తెలంగాణ‌లో ఎక్కడ స్థ‌లం కొనాల‌నుకున్నా.. ఇల్లు కొనాల‌నుకున్నా.. ఆయా ఇంటికి సంబంధించిన సంపూర్ణ చ‌రిత్ర ఇట్టే తెలిసిపోతుంది.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *