చంద్రబాబుపై వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్

Telangana News

తెలంగాణాలో ఎన్నికల నేపధ్యంలో బీజేపీ టీఆర్ఎస్ తో రహస్య ఒప్పందం చేసుకుందని ప్రచారం ఉంది. అందులో భాగంగానే బీజేపీ యెన్నికల్లొతేఆర్ఎస్ కు అంతర్గతంగా సహకారాన్ని అందిస్తుంది. అందుకే చంద్రబాబు కాంగ్రెస్ తో పాటు కలిసి వచ్చే పార్టీల పొత్తులతో టీఆర్ఎస్ ను ఓడించేందుకు రంగంలోకి దిగాడు. అలా కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు చెక్ పెట్టాలనుకున్నాడు.
కేంద్రంలో బీజేపీని, తెలంగాణా రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించేందుకు చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మరీ రాహుల్ ని కలిశారు. కాగా దీనిపై తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ వేసిన సెటైర్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గతంలో చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీపై దుమ్మెత్తిపోస్తూ చేసిన ట్వీట్ల స్క్రీన్‌ షాట్స్‌ను షేర్‌ చేస్తూ.. ‘చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలకన్నా ఇంకా ఏం మాట్లడలేం’ అని క్యాప్షన్‌గా పెట్టి వాటిని షేర్ చేశారు కేటీఆర్ .అయితే టీడీపీ-కాంగ్రెస్‌ ల కలయికపై విస్మయం కలుగుతున్నా రాజకీయాల్లో అవసరాన్ని బట్టి ఏ పార్టీ ఏ పార్టీ తో కలవటానికి అయినా సిద్ధమే అంటున్నారు ఈ కలయికలను చూస్తున్న ప్రజలు. ప్రస్తుతం కేటీఆర్ షేర్ చేసిన స్క్రీన్ షాట్స్ లో చంద్రబాబు కాంగ్రెస్ ని తిడుతున్నట్లు ఉంది. అందుకే కేటీఆర్ నో కామెంట్ అని పోస్ట్ చేస్తూ చంద్రబాబుని ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు.

Telangana News,KTR Tweet on Chandrababu ,KTR Tweet is a viral on Chandrababu , KTR Latest News, telangana Latest News, Telugu News,BJP Party Latest News, telugu News, Chandrababu Latest News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *