ఓటరు చీటీలు అందకుంటే ఇలా చేయండి

Telangana Poling News

  • తెలంగాణవ్యాప్తంగా రేపే పోలింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఘట్టం తుది దశకు చేరుకుంది. ప్రచారం ముగిసింది. అభ్యర్థుల తలరాతను రాయడానికి ఓటర్లు సిద్ధమవుతున్నారు. శుక్రవారం తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఓటు వేయడానికి అవసరమైన ఓటరు చీటీలను ఈనెల 2వ తేదీ నుంచే పంపిణీ చేశారు. పోలింగ్ బూత్ ల వారీగా ఫొటో ఓటరు స్లిప్పులు అందజేశారు. ఒకవేళ పోలింగ్ సమయంలో ఆ స్లిప్పులు అందుబాటులో లేకుంటే ప్రత్యామ్నాయంగా 12 రకలా గుర్తింపు కార్డులు చూపించి ఓటు వేయొచ్చు. పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీచేసిన గుర్తింపు కార్డులు, బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోలతో జారీ చేసిన పాస్‌పుస్తకాలు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాబ్‌కార్డ్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డ్, ఫొటోతో ఉన్న పెన్షన్‌ ధ్రువీకరణ పత్రం, ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫొటో ఓటర్‌ స్లిప్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఎన్‌పీఆర్‌ కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్‌ చూపించడం ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. హైదరాబాద్‌ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో దాదాపు 40 లక్షల మంది ఓటర్లున్నారు. ఈ నెల 2న వారందరికీ జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం ద్వారా ఓటరు చీటీల పంపిణీ మొదలైంది. అయితే, చీటీలు అందని వారు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు లేదా సర్కిల్‌ మున్సిపల్‌ కార్యాలయాన్ని సంప్రదించాలని ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ‘నా ఓటు’, జీహెచ్‌ఎంసీ రూపొందించిన ‘మైజీహెచ్‌ఎంసీ’ మొబైల్‌ అప్లికేషన్లతోనూ ఓటరు చీటీని పొందవచ్చు. ఓటరు కార్డులోని నంబరు లేదా పేరు, ఇతర వివరాలను నమోదు చేస్తే.. ఓటు వేయాల్సిన పోలింగ్‌ కేంద్రం చిరునామాతో కూడిన పేజీ వస్తుంది. దానిని ప్రింట్ తీసుకుని వెళ్లి, ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా ఓటు వేయొచ్చు.

Telangana Poling News , The campaign has ended , Passport, Pancard, Job card, Telugu news, Telangana Update news, Telangana Election news

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *