సీట్ల కోసం టీటీడీపీ గ్రేటర్ నాయకుల టెన్షన్

telangana tdp latest news

తెలంగాణలో కేసీఆర్ ను గద్దెదింపేందుకు ఏర్పడిన మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ తుది దశకు చేరుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతున్నారని భోగట్టా. అభ్యర్థుల విషయమై కొన్ని లీకులు వచ్చినట్లు కూడా సమాచారం. అయితే దానిపై క్లారిటీ లేదని తెలుస్తోంది. దీనికితోడు ఆశావహులకు ప్రచారం చేసుకోమని కూడా టీడీపీ హైకమాండ్ నుంచి ఇంతవరకూ సమాచారం లేకపోవడంతో వారు మల్లగుల్లాలు పడుతున్నారట. మరోవైపు కొందరు నేతలు తమకు సీటు దక్కుతుందా? లేక చేజారుతుందా? అనే ఆందోళనలో టీటీడీపీ నేతలు సతమతమవుతున్నారని సమాచారం. ఇప్పటికే టికెట్ కోసం అమరావతి చుట్టూ చక్కర్లు కొట్టినవారంతా టెన్షన్లో మునిగిపోయారని భోగట్టా. కాంగ్రెస్ తో జతకట్టిన టీడీపీ కి మొత్తం 14 సీట్లు కేటాయించారని అంటున్నారు. దీంతో పార్టీ లోని కొద్దిమంది సీనియర్ నేతలు మినహా అసెంబ్లీ టికెట్ ఎవరికి దక్కుతుందో ఇంతవరకు స్పష్టంగా వెల్లడికాలేదు. మరోవైపు మహాకూటమి పొత్తులో భాగంగా తమ నియోజకవర్గం టీడీపీ కి దక్కుతుందా? లేక ఇతర పార్టీల కు వెళుతుందా అనేది తేలకపోవడంతో టీడీపీ ఆశావహులు ఏమిచేయాలో తెలియని స్థితిలో ఉన్నారట. టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి కూకట్‌పల్లి నుంచి పోటీ చేయాలని తాపత్రయ పడుతుండగా, చంద్రబాబు నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది.

అలాగే మరో నేత రేవూరి ప్రకాష్ రెడ్డి నర్సం పేట సీటు కోసం పట్టుబడుతున్నారని తెలుస్తోంది. అయితే ఆ స్థానంలోకాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో పొత్తులో ఆ సిటు టీడీపీ కి వచ్చే అవకాశం కనపడటం లేదని సమాచారం. అలాగే కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులకు రెండు సీట్లు ఆశిస్తున్నారని సమాచారం. అయితే వీరికి పొత్తులో భాగంగా ఒక సీటు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో దయాకర్ రెడ్డి మరో సీటు కూడా కావాలని అధిష్టానాన్ని కోరుతున్నారట. టీడీపీ నేతలు మరో రెండు ,మూడు సీట్లు కావాలని ఒత్తిడి చేయాలని చంద్రబాబును కోరుతున్నారు. టీడీపీ కి లభించే సీట్లలో సీనియర్ నేతలకు అవకాశం దక్కుతున్నదని తెలుస్తున్నప్పటికీ గ్రేటర్ సీట్ల విషయంలో స్ఫష్టత లేకపోవడంతో ఆశావహులు ఆందోళనలో మునిగిపోయారని సమాచారం. మరోవైపు శేరిలింగం పల్లి సిటు కోసంకోసం భవ్య ఆనంద్ ప్రసాద్, మొవ్వ సత్యనారాయణలు పోటీ పడుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరిలో సిటు ఎవరికి దక్కుతుందో వెల్లడికాలేదు. అలాగే ఇటీవలే టీడీపీ లో చేరిన నందీశ్వర్ గౌడ్ పఠాన్ చెరు టికెట్ కోసం చంద్రబాబును కలిశారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో గ్రేటర్ టీడీపీ నేతల టెన్షన్ త్వరలోనే తీరిపోనున్నదని సమాచారం.

telangana tdp latest news,greater hyderabad tdp leaders are fighting for mla ticket,telangana tdp leader revuri prakash reddy want narsampet mla ticket

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *