తెలంగాణలో టీడీపీ పోటీ చేసే 11 సీట్లు ఇవే … మరో ౩ పెండింగ్

telangana tdp party latest news

మహా కూటమి లో సీట్ల సర్దుబాటు మరింత కొలిక్కి వచ్చింది. కూటమిలో కాంగ్రెస్, టిడిపి, తెలంగాణ జన సమితి హ్యాప్పీగానే ఉన్నాయి. కానీ కూటమి ఏర్పాటు చేసిన సిపిఐ మాత్రం ఆవేదనతో, ఆందోళనతో ఉంది. కారణమేంటే ఆ పార్టీ 5 సీట్లు అడుగుతుంటే 3 మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ తేల్చి పారేశింది. దీంతో వారు కూటమిలో ఉంటారా లేదా అన్న టెన్షన్ నెలకొన్నది.

   ఈ నేపథ్యంలో టిడిపికి 14 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అందులో ఇప్పుట ివరకు అందుతున్న సమాచారం మేరకు 11 సీట్లు క్లియర్ అయినట్లు తెలుస్తోంది. మరో మూడు సీట్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది.

11 స్థానాల్లో  టీడీపీ లిస్టు ఫైనల్ అయ్యింది .

1 వరంగల్ ఈస్ట్ – రేవూరి ప్రకాశ్ రెడ్డి

2 సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య

3 ఉప్పల్ వీరేందర్ గౌడ్

4 అశ్వరావుపేట – మచ్చా నాగేశ్వర రావు

5 మక్తల్ – కొత్తకోట దయాకర్ రెడ్డి

6 ఖమ్మం – నామా నాగేశ్వర రావు

7 మహబూబ్ నగర్ – ఎర్ర శేఖర్

8 నకిరేకల్ – పాల్వాయి రజని కుమారి

9 నిజామాబాద్ రూరల్ – మండవ వెంకటేశ్వరరావు

10 శేర్ లింగంపల్లి – భవ్య ఆనంద ప్రసాద్

11 కూకట్ పల్లి –  పెద్దిరెడ్డి లేదా మందాడి శ్రీనివాసరావు

ఇక పెండింగ్ లో ఉన్న సీట్ల వివరాలు

1 ఖైరతాబాద్

2 జూబ్లీహిల్స్

3 ఎల్ బి నగర్

పై మూడు స్థానాలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ మూడు సీట్లను కూడా టిడిపి కోరుతున్నది. కానీ వీటిై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఎల్బీ నగర్ గతంలో టిడిపి సీటు కావడంతో ఆ సీటును తిరిగి తమకే ఇవ్వాలని టిడిపి పట్టుబడుతున్నది. గతంలో మూడో స్థానానికి పరిమితమైన సుధీర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం సరికాదని టిడిపి వాదిస్తున్నది. అలాగే జూబ్లీహిల్స్ సీటును సైతం టిడిపి కోరుతున్నది. ఇక్కడ మహిళా నాయకురాలు ఉప్పలపాటి అనూష రాం, ప్రదీప్ చౌదరి సీటును ఆశిస్తున్నారు. మరి వీటి పై క్లారిటీ వస్తే ఇక్కడ కూడా టీడీపీ బరిలోకి దిగనుంది.

telangana tdp party latest news,congress gave 11 seats for telangana tdp party,3 mla seats are pending for telangana tdp party

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *