టికెట్ల కోసం తెలుగు తమ్ముళ్ళ బలప్రదర్శన

telangana tdp party latest news

మహా కూటమి లోని టీడీపీ ఆశావహులు టికెట్ కోసం నానాపాట్లు పడుతున్నారు. కూటమి ఏర్పడినప్పటినుండి వారి వారి సీట్ల యొక్క స్థానాలపై మరియు సీట్ల ఖరారుపై అధికారిక ప్రకటనలో జాప్యం అవడంతో తెలుగు తమ్ముళ్లు బలప్రదర్శనలకు దిగుతున్నారు. తాము ఆశిస్తున్న స్థానం కోసం పోటీపడుతున్న మిత్రపక్షాలకు తమ సత్తా చూపుతామని చెప్పుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా నియోజకవర్గాల్లో పార్టీ టిక్కెట్‌ ఆశిస్తున్న నాయకులు స్థానికంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు వారు భారీ ర్యాలీలకు సిద్ధమయ్యారు. కొత్తగూడెం సీటు కోసం గట్టిగా పట్టుబడుతున్న టీడీపీ సీనియర్‌ నేత కోనేరు చిన్ని సోమవారం పట్టణంలో భారీ ప్రదర్శన బహిరంగ సభలాగా నిర్వహించారు.

ఆదివారం రాత్రి పటాన్‌చెరు నియోజకవర్గంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఎడ్ల రమేశ్‌ ఆధ్వర్యంలో మహాకూటమి నాయకులతో చిన్న కార్యక్రమం నిర్వహించారు. బీరంగూడలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ, టీజేఎస్‌, కాంగ్రెస్‌ల నుంచి వందల మంది కార్యకర్తలు తరలివచ్చారు. మక్తల్‌, దేవరకద్ర నియోజకవర్గాల్లో పార్టీ సీనియర్‌ నేత కొత్తకోట దయాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాలు ముమ్మరం చేశారు. కాగా, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీడీపీ టిక్కెట్టు కోసం పోటీపడుతున్న మొవ్వా సత్యనారాయణ, ఆనంద్‌ప్రసాద్‌ వర్గీయులు ఆదివారం పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించడం.. ఈ సందర్భంగా ఘర్షణ తలెత్తడం జరిగింది. ఈ తరుణంలో ఇరువర్గాల నేతలతో టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణ సోమవారం మాట్లాడారు. క్రమశిక్షణతో ఉండాలని అందరు సంయమనం పాటించాలని సూచించారు. అనంతరం మొవ్వా సత్యనారాయణ మియాపూర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. శేరిలింగంపల్లి టీడీపీలో వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలు లేవని స్పష్టం చేశారు. ఏదిఏమైనా ఈసారి కూడా అధికారంలోకి వచ్చేది మహాకూటమే అని చెప్పుకొచ్చారు.

telangana tdp party latest news,telangana tdp party leaders fights for mla ticket,telangana tdp party update news,tdp leaders fight mla ticket

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *