ఇండో-అమెరికా-తెలంగాణం

Telugu Latest Updates
ఇండో – అమెరికా – తెలంగాణం : బ‌లం..బ‌ల‌హీన‌త.. నిరాశ. దేశాలు వేరైనా లైంగిక దాడులు వివ‌క్ష‌త అన్నీ అన్నిచోట్లా ఒకే విధంగా ఉంటున్నాయి. పాక్ భార‌త్ అమెరికా ఇలా ఏ దేశ‌మ‌యినా మ‌హిళ‌ల‌కు కాస్త సంర‌క్ష‌ణ‌ను ఇవ్వ‌లేక‌పోతున్నాయి.ఎందరెంద‌రిపైనో లైంగిక అకృత్యాల‌కు పాల్ప‌డి హాలీవుడ్ ఫేం హార్వీ వైన్ స్టీన్ ఉదంతం వెలుగు చూశాక  అక్క‌డ మీటూ ఉద్య‌మం ఊపందుకుంది.అయిన‌ప్ప‌టికీ కొంద‌రు ఈ ఉద్య‌మానికి దూరంగా ఉన్నారు.అసలీ ఉద్య‌మం పోక‌డ విస్తృతం అవుతున్న‌కొద్దీ ఎంద‌రెంద‌రో త‌మ పేర్లు వెల్ల‌డించి తాము ఎదుర్కొన్న ఉదంతాల‌ను వెల్ల‌డించిన‌ప్ప‌టికీ ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టి లేలో మాత్రం ఇందుకు తాను విరుద్ధ‌మ‌ని మీటూకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌నేని చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అలా వెల్ల‌డిస్తే అది బ‌ల‌హీన‌తే త‌ప్ప బ‌లం కాద‌ని తేల్చేశారు. ఇక మ‌న దేశానికి వ‌స్తే లైంగిక దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి అస‌లు అమ్మాయిల‌కు సుర‌క్షితంగా నిలిచే దేశంగా భార‌త్ ఉండ‌డం లేద‌ని ప‌లు నివేదిక‌లు ఘోషిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ  చ‌ర్య‌లు మాత్రం అంతంత‌మాత్ర‌మే అవుతున్నాయి. లైంగిక హింస‌కు బ‌లికాకుండా అమ్మాయిల‌ను ఆ దారుణ కాండకు దూరం ఉంచ‌గ‌లిగిన‌ప్పుడు మాత్ర‌మే భార‌త్ లో సిస‌లు స్వాతంత్ర్యం అమ్మాయిలు పొందిన‌ట్లు.
ఇక బీజేపీ మ‌గ‌వాళ్ల పార్టీ అని మోడీ మ‌హిళ‌ల‌ను నిర్ల‌క్ష్యం చేశార‌ని వ‌స్తున్న విమ‌ర్శ‌ల్ని  బీజేపీ నేత‌లు తిప్పికొట్టారు. రాహుల్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను స్మృతి ఇరానీ కొట్టిపారేశారు. అందుకు కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు వెల్ల‌డించి తెలియ‌కుండా మాట్లాడ‌డం రాహుల్ మానుకోవాల‌ని ఆమె ఉద‌హ‌రించారు. మోడీ స‌ర్కారులో మ‌హిళా ప్రాధాన్యం స‌రే కానీ వారంత‌ట వారు నిర్ణ‌యాలు తీసుకునేలా ప్ర‌ధాని అనుమ‌తిస్తున్నారా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఆఖ‌రుగా తెలంగాణ విష‌య‌మై మాట్లాడుకుంటే ఇక్క‌డి స‌ర్కారులో ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా మ‌హిళా మంత్రి లేర‌ని హన్మ‌కొండ‌కు చెందిన లాయ‌ర్ శ్రీ‌రాం వేసిన పిల్ ని హైకోర్టు తోసిపుచ్చింది.మంత్రివ‌ర్గంలో త‌ప్ప‌నిస‌రిగా మహిళ‌ల‌ను తీసుకోవాల‌ని రాజ్యాంగం నిర్దేశించ‌లేద‌ని క‌నుక తాము ఆ విధంగా మార్గ‌ద‌ర్శ‌కాలు రాష్ట్ర ప్ర‌భుత్వానికి జారీ చేయ‌లేమ‌ని పేర్కొంది.
Latest Updates, Telangana Updates, Political Updates, To Day Breaking News, Womens Are Not Safe

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *