వ‌రుణ్‌, వెంకీ కూలీలా?

Telugu Movie
విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా బిడ్డ వ‌రుణ్‌తేజ్ క‌లిసి న‌టిస్తున్న సినిమా ఎఫ్‌2. ఈ చిత్రంలో వీళ్లిద్ద‌రూ తోడ‌ళ్లుళ్లుగా క‌నిపించ‌నున్నారు. అనిల్ రావిపూడి తీస్తున్న స‌ర‌దా చిత్ర‌మిది. ఈ సినిమాలో ఓ స‌న్నివేశంలో ఈ హీరోలిద్ద‌రూ కూలీలుగా క‌నిపించనున్నారు. తెలుగు తెర‌పై ఎవ‌రు జైలులో క‌నిపించినా, ఎవ‌రు కూలీలుగా క‌నిపించినా వారి సంఖ్య కు ప్ర‌ధాన్యం ఉంటుంది. ఎందుకంటే ఖైదీ నెంబ‌ర్ 786గా చిరంజీవి, కూలీ నెంబ‌ర్ 1గా వెంక‌టేష్ తెర‌పై త‌మ ముద్ర‌ను వేశారు గ‌నుక‌. తాజాగా ఎఫ్‌2 విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. ఇందులో వెంక‌టేష్ కూలీ నెంబ‌ర్ 1గా క‌నిపిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ మాత్రం త‌న పెద‌నాన్న వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ కూలీ నెంబ‌ర్ 786గా క‌నిపించ‌నున్నారు. ఈ బ్యాడ్జ్ లున్న ఫొటోల‌ను అనిల్ రావిపూడి ట్విట్ట‌ర్‌లో పంచుకున్నారు. త‌మ‌న్నా, మెహ్రీన్ ఈ చిత్రంలో క‌థానాయిక‌లు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

Telugu Movie , telugu Movie News update Venkatesh and  Varuntej new movie , F2 Movie News , Telugu News Update, Telugu Late Movie

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *