డైరెక్ట‌ర్‌కి ముగ్గురు హీరోల వార్నింగ్‌…

Telugu Movie News

ఒద్దిక‌గా ఉంటేనే ఇండ‌స్ట్రీలో ఉంటారు. ఎగిరి ప‌డితే ఊసే లేకుండా పోతారు. ఆ విష‌యాన్ని మ‌ర‌చిపోయిన‌ట్లున్నాడు ఓ డెబ్యూ డైరెక్ట‌ర్.. అత‌నే ఇంద్ర‌సేన. త‌ను డైరెక్ట్ చేసిన చిత్రం `వీర‌భోగ‌వసంత రాయ‌లు`. క‌ల్ట్ మూవీ అంటూ ఊద‌ర గొట్టారు. నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్‌బాబు, శ్రియా శ‌ర‌న్ ఈచిత్రంలో న‌టించారు. దాంతో సినిమాలో మంచి విష‌య‌ముంటుంద‌ని అంద‌ర‌రూ భావించారు. తీరా చూస్తే సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. సినిమా విడుద‌ల‌కు ముందే హీరో సుధీర్‌కి, డైరెక్ట‌ర్‌కి మ‌న‌స్ప‌ర్ధ‌లు. దాంతో సుధీర్ బాబు డ‌బ్బింగ్ కూడా చెప్ప‌లేదు. మ‌రేవ‌రో డ‌బ్బింగ్ చెప్పారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక సినిమా ఎవ‌రికీ న‌చ్చ‌లేదు. విమ‌ర్శ‌కులు సినిమా బాలేద‌ని తేల్చేశారు, రివ్యూలు సినిమాకు నెగ‌టివ్‌గా వ‌చ్చాయి.
మొగుడు తిట్టినందుకు కాదు.. పెద్ద భార్య న‌వ్వినందుకు అనే త‌ర‌హాలో డైరెక్ట‌ర్ ఇంద్ర‌సేన త‌న అక్క‌సునంతా రివ్యూ రైట‌ర్స్‌పై వెల్ల‌గ‌క్కాడు. ఫ‌క్ ది రివ్యూస్ గో టు థియేట‌ర్స్ అండ్ ఎంజాయ్ ది క‌ల్ట్ అంటూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశాడు. అంత‌టితో ఆగ‌కుండా చెడ్డ సినిమాను రివ్యూస్‌తో నిల‌బెట్ట‌వ‌చ్చు కానీ మంచి సినిమాను రివ్యూస్‌తో చంప‌లేరు. మీకు సినిమా అర్థం కాలేదు. నాకు హిమాల‌యాల నుండి పిలుపు వ‌చ్చింది. ఇలా ఏవేవో పిచ్చి రాత‌ల‌తో రెచ్చిపోయాడు ఇంద్ర‌సేన‌. నిజంగానే రివ్యూల‌పైనే ప్రేక్ష‌కులు ఆధార‌ప‌డ‌తారా? అంటే క‌చ్చితంగా ఎవ‌రైనా కాద‌నే చెబుతారు. ఎందుకంటే రివ్యూల‌నేవి స‌ద‌రు విమ‌ర్శ‌కుడి కోణంలోనే ఉంటాయి. నిజంగా అలా ఆధార‌ప‌డేలా ఉంటే సినిమా ఇండ‌స్ట్రీ మ‌న గ‌లుగుతుందా? బ‌్యాడ్ రివ్యూలు వ‌చ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యాన్ని సాధించ‌లేదా? సినిమాలో విష‌యం లేక‌పోతే రివ్యూ రైట‌ర్ ఏం చేస్తాడు? స‌రే! రివ్యూరైట‌ర్స్ కావాల‌నే బ్యాడ్‌గా రాసినా.. ప్రేక్ష‌కుల‌కు సినిమా బావుంటే ఆద‌రించాల‌ని తెలియ‌దా? ఈ లాజిక్‌ను ద‌ర్శ‌కుడు ఎలా మ‌ర‌చిపోయాడు? ఆడ‌లేమ‌న్నా మ‌ద్దెల ఓడు అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తే ఇండ‌స్ట్రీలో మ‌న‌గ‌లుగుతామా? ఆలోచించుకుంటే బావుంటుంది.
ఇది డైరెక్ట‌ర్‌గా ఇంద్ర‌సేన‌పై ఎఫెక్ట్ ప‌డ‌వ‌చ్చు లేదా ప‌డ‌క‌పోవచ్చు. ఒక సినిమా డైరెక్ట‌ర్‌గా త‌న‌కు పోయేదేమీ లేదు. త‌ను మేధావే కావ‌చ్చు. సినిమా అర్థం కాక‌పోతే ఎవ‌డూ ఏమీ చేయ‌లేదు. అయితే.. ఈ చిత్రంలో న‌టించిన హీరోలు సుధీర్‌బాబు, నారా రోహిత్‌, శ్రీవిష్ణుల‌పై ఎఫెక్ట్ ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు. వెంట‌నే తేరుకున్న శ్రీవిష్ణు రివ్యూ రైట‌ర్స్ అంటే త‌న‌కు గౌర‌వం అని.. డైరెక్ట‌ర్ వ్యాఖ్య‌ల‌కూ, త‌న‌కు ఏ సంబంధం లేదు అంటూ మెసేజ్ పెట్టారు. మిగిలిన ఇద్ద‌రు హీరోలు కూడా డైరెక్ట‌ర్‌కి గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Nara Rohith ,Sudeer babu , Sree Vishnu , Director  Indrasena , Telugu latest movie , Telugu Latest movie , Veero boga Vasanta Rayalu,

Telugu movie update news, Telugu Movie News ,Warning of three heros to Director

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *