నంద‌మూరి – మెగా.. ప‌ట్టించుకునేవారేరీ?

Telugu Movie News
నంద‌మూరి హీరో ఎన్టీఆర్ అలియాస్ తార‌క్‌.. మెగా ఫ్యామిలీ హీరో రామ్‌చ‌ర‌ణ్ అలియాస్ చెర్రీ న‌టిస్తోన్న సినిమా ట్రిపుల్ ఆర్‌. ఈ సినిమాకు `బాహుబ‌లి` ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి డైర‌క్ట‌ర్‌. ఈ సినిమాను తెలుగువారు మాత్ర‌మే మ‌ల్టీస్టార‌ర్‌గా చూస్తున్నాం. మిగిలిన ప్ర‌పంచం మొత్తం `బాహుబ‌లి` మేక‌ర్ నెక్స్ట్ మూవీగానే చూస్తోంది. అంటే ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అటు ఎన్టీఆర్‌, ఇటు రామ్‌చ‌ర‌ణ్‌.. ఇద్ద‌రు హీరోలను మించిన క్రేజ్‌మీద ఉన్నారు. అందుకే ప్రపంచం మొత్తం ఈ సినిమాను డైర‌క్ట‌ర్స్ సినిమాగానే చూస్తోంది. దానికి తోడు సినిమా గురించి ఏమ‌డిగినా ఎన్టీఆర్ లాంటి వ్య‌క్తే… `జ‌క్క‌న్న చెప్పొద్ద‌న్నారు` అనే ప‌దాల‌ను వాడుతున్నారు. అటు ఎన్టీఆర్‌కీ, ఇటు రామ్‌చ‌ర‌ణ్ కీ ఇద్ద‌రికీ రాజమౌళితో ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేష‌న్ తెలుగు సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి. ఒక్క విష‌యం మాత్రం క‌న్‌ఫ‌ర్మ్. ఇది కేవ‌లం తెలుగు ఇండ‌స్ట్రీని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న సినిమా కాదు. పాన్ ఇండియ‌న్ మూవీ. కాక‌పోతే మ‌రీ `బాహుబ‌లి`లా అన్న‌న్నేళ్లు మాత్రం చిత్రీక‌ర‌ణ ఉండ‌ద‌ట‌.ఈ నెల 11న ఉద‌యం 11 గంట‌ల‌కు ముహూర్తం వైభ‌వంగా జ‌ర‌గ‌నుంద‌ని డీవీవీ దాన‌య్య చెప్పారు. ఆ రోజు సినిమా గురించి మ‌రిన్ని వివ‌రాలు అందిస్తార‌ని స‌మాచారం.
Nandamuri Hero JRNTR New Movie , Latest Telugu Movie News, Telugu Movie News, Ram charan Latest Movie

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *